కార్తీ 'జపాన్' రివ్యూ

First Published | Nov 10, 2023, 1:39 PM IST

దీపావళి సందర్భంగా  కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన సినిమా 'జపాన్' ఈ రోజు రిలీజైంది.

Japan Review


 
తమిళ హీరో కార్తీ..ప్రతీ సినిమా తెలుగులోకి డబ్బింగ్ అవుతోంది. తనే డబ్బింగ్ చెప్పుకుంటూ మరి తెలుగు హీరో అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యన పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న కార్తీ.. వెంటనే మరో సినిమాతో మన ముందుకు వచ్చేశాడు.  పొన్నియన్ లో పోరాట యోధుడిగా, సర్దార్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న స్పై గా కనిపించిన   కార్తీ.. జపాన్ తో ఓ బంగారం దొంగగా మన మనస్సులు దోచుకుంటానన్నాడు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది?  అసలు జపాన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు...కార్తీకు ఇదో హిట్ చిత్రం అవుతుందా, అసలు కథేంటో చూద్దాం. 


స్టోరీ లైన్:

 గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ)  దొంగతనాలు చేస్తూ ఉన్న ఈ ఒక్క జీవితంలో అన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఆ పనిలో ఉంటాడు. అందులో క్రమంలో అతనికు ఎయిడ్స్ సైతం వస్తుంది. ఇక అతని దొంగతనాలతో వచ్చిన డబ్బుతో తనే హీరోగా  సినిమాలు సైతం తీసుకుంటూ ఉంటాడు. అవి తనే జనం ఉన్నా లేకపోయినా థియేటర్ లో ఆడించుకోవటం, యూట్యూబ్ లో పెట్టడం చేస్తూంటాడు. అఫ్ కోర్స్ అతనికి ఫ్యాన్స్ కూడా ఉంటాడు.ఇక అతని జీవితంలో సంజు (అను ఇమ్మాన్యుయేల్)అనే అమ్మాయి. ఆమె అతనితో కెరీర్ లో ప్రారంభంలో నటించి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యి..ఇతన్ని ప్రక్కన పెట్టేస్తుంది. ఇది జపాన్ కు కాలిపోతూంటుంది. ఇదిలా ఉండగా..హైదరాబాద్ లో ఉన్న  రాయల్ జ్యువెలరీలో రూ. 200 కోట్ల విలువలైన నగలు, ఆభరణాలు దోపిడి జరుగుతుంది. దాంతో అందరి దృష్టీ  గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) మీదకే వెళ్తుంది. పోలీస్ లు వెంటబడుతూంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటింటే జపాన్ ఆ దొంగతనం చేయడు..మరి ఎవరు చేసారు...  జపాన్  ప్రేమించిన అమ్మాయి ఎందుకు అతన్ని పట్టించుకోవటం లేదు? అసలు జపాన్ కు ఆ పేరు ఎందుకు వాళ్ళ అమ్మ పెట్టింది...తనమీదుకు వచ్చేలా దొంగతనం చేసింది ఎవరు..వాడిని జపాన్ పట్టుకోగలిగాడా..చివరకు ఏమైంది.  తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.



విశ్లేషణ:
 
దర్శకుడుగా రాజు మురగన్ అనగానే అనేక అవార్డులు తెచ్చి పెట్టిన జోకర్ చిత్రం గుర్తు వస్తుంది. అంతటి టాలెంట్ ఉన్న దర్శకుడు ఈ సినిమా తీసాడంటే నమ్మబుద్ది కాదు. ఓ నగల దొంగ చుట్టూ తిరిగే ఈ కథలో ఆయన ఏం చెప్పాలనుకున్నారో స్పష్టం కాదు. అప్పటికీ కార్తీ తనదైన హ్యూమర్, డైలాగు డెలవరీతో చివరిదాకా కూర్చో  బెట్టే ప్రయత్నం చేసారు. హీరోకు మొదట్లోనే HIV పాజిటివ్ అని చెప్పినప్పుడే మనకు సగం ఇంట్రస్ట్ పోతుంది. అలాగే పేరు మోసిన దొంగ అంటారు కానీ అతను చేసే సరైన దొంగతనం ఏదీ చూపెట్టరు. దొంగ బయోపిక్ లాంటి కథ అనగానే అదిరిపోయే ప్లాన్ తో చేసే దొంగతనాలు, పోలీస్ లనుంచి తప్పించుకోవటాలు ఉంటాయనుకుంటాం. కానీ దొంగతనాలు,పోలీస్ లు ఉంటారు కానీ అందులో ఆ కిక్ ఉండదు. ముఖ్యంగా ఇనిస్టిగేజ్ ఫేజ్ అయితే ఎప్పుడు అయ్యిపోతుందా అనిపిస్తుంది. ఇక దొంగగా కార్తీ చేయటానికి ఏమీ లేదు..ఎంతసేపూ తప్పించుకోవటమే పని. దొంగతనాలు చేసేవాడు తప్పించుకోక ఏం చేస్తాడు అంటే..అలాంటప్పుడు అదోదో గొప్ప కథ అన్నట్లు మనకు చూపటం ఎందుకు..కథ కొంతదూరం వెళ్లే సరికి కార్తీ క్యారక్టర్ తగ్గిపోయి..మిగతా క్యారక్టర్స్ హైలెట్ అవుతూంటాయి. ఎక్కడా సర్పైజ్ లు ఉండవు. లవ్ స్టోరీ ఉంటుంది కానీ మనకు ఆ ప్రేమ కథ గెలవాలనిపించే స్దాయిలో సీన్స్  ఉండవు. ఉన్నంతలో ఇంట్రవెల్ ట్విస్ట్ కాస్త ఇంట్రస్టింగ్ గా ఉంది. సెకండాఫ్ లో అదీ సస్టైన్ చేయలేకపోయారు. క్లైమాక్స్ కు వచ్చేసరికి తమిళ అతి సీన్స్ వచ్చేసి తల్లి సెంటిమెంట్ ప్లే అవటం మొదలవుతుంది. కాకపోతే అక్కడక్కడా కొన్ని సీన్స్ లో కామిక్ రిలీఫ్ ఉండటమే చూసేవారిని కాపాడండి. ఏదమైనా కొత్తదనం అవసరమే కానీ మరీ ఇంతలా వెళ్తే కష్టం కార్తీ. 


టెక్నికల్ గా...

ఈ సినిమా టెక్నికల్ గా  జస్ట్ ఓకే అని చెప్పాలి.  రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుందేమో అని ఆశిస్తే నిరాశే. స్టోరీ టెల్లింగ్ సమస్యగా మారింది.  ఎక్కడా వావ్ అనిపించే ఎలిమెంట్స్, భలే ఉందే అనిపించే సీన్స్ , ట్విస్ట్ లు లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. రెట్రో స్టైల్ లో కలర్ కాంబినేషన్స్ తో కొత్తగా అనిపించే ప్రయత్నం చేసారు.  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో  పాటలు బాగోలేదు.  స్క్రీన్ ప్లేలో ఇంట్రవెల్  ట్విస్ట్ తప్పించి ఏమీ కలిసిరాలేదు. ఓ టైమ్ దాటాకా చాలా ప్రెడిక్టబుల్ గా సాగి..ఎప్పుడు సినిమా అయ్యిపోతుందా అనిపిస్తుంది.   నిర్మాణ విలువలు బాగున్నాయి.  డైలాగులు చాలా చోట్ల లిప్ సింక్ లేకపోయినా సీన్ లింక్ తో  పేలాయి. ఎడిటింగ్ కొన్ని చోట్లా మరింత షార్ప్ చేయచ్చు. అక్కర్లేని సీన్స్ తీసేస్తే ఇంకాస్త స్పీడుగా ఉండేది. 


ఫెరఫార్మెన్స్ వైజ్ చూస్తే..

కార్తీ ఎప్పటిలాగే తన వెర్శటైల్ యాక్టింగ్ స్కిల్స్ తో  అదరకొట్టారు. గోల్డెన్ స్టార్ జపాన్  పాత్రలో వేరే వాళ్లను ఊహంచలేము. డైలాగు డెలవరీ, గెటప్ అన్నీ రెట్రో స్టైల్ లో కొత్తగా అనిపించాయి. అయితే క్యారక్టర్ లో డెప్త్ లేకపోవటం, పోగ్రసింగ్ లేకపోవటం ఇబ్బందిగా మారాయి. హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయిల్ సినిమాలోనూ హీరోయిన్ గానే కనిపించింది. సాంగ్స్ లో బాగుంది. కానీ ఆమె పాత్ర పెద్దగా లేదు. ఎందుకనో ఆమె పాత్రకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. సునీల్ కూడా కొత్తగా బాగా చేసారు. అయితే ఆ పాత్రకు సరైన ప్రారంభం,ముగింపు లేవు. మిగతా పాత్రలు కథలో అలా వచ్చి వెళ్లిపోయారు. 


బాగున్నవి:  

కార్తీ ఫెరఫార్మెన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
తక్కువ రన్ టైమ్


బాగోలేనివి:  

అర్దం పర్దం లేని కథ
విసుగెత్తించే స్క్రీన్ ప్లే
అరవ అతితో నడిచే సీన్స్ 

 
ఫైనల్  ధాట్:

మొన్న టైగర్ నాగేశ్వరరావు, ఇప్పుడు జపాన్ ఇలా దొంగలను హీరోలుగా లేపి చిత్రీకరించే కథల్లో  హీరోయిక్ లక్షణాలు లేకపోవటంతో ఎంతపెద్ద హీరోలు చేసినా అవి హీరో కథలుగా అనిపించక సోసోగా మారిపోయాయి. ఈ రెండింటి రిజల్ట్ తో అయినా ఈ ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పెడితే బాగుండును. 

----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2

japan


నటీనటులు: కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు 
మాటలు (తెలుగులో) : రాకేందు మౌళి
ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు: ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు
దర్శకత్వం: రాజు మురుగన్
విడుదల తేదీ: నవంబర్ 10, 2023  
 

Latest Videos

click me!