Prema Entha Madhuram: ఆర్య ఇంట్లో జిండేకు అడ్డంగా బుక్కైన రాగసుధ.. ఆమె తలపై గన్ పెట్టి?

Navya G   | Asianet News
Published : Feb 05, 2022, 09:38 AM IST

Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Madhuram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్ ఏమిటో తెలుసుకుందాం. ఆర్య కారులో ఫన్నీ గా కిడ్నాప్ అని చెప్పి అను ను ఒక గెస్ట్ హౌస్ కి తీసుకొని వస్తాడు. కానీ అను (Anu) ఆ గెస్ట్ హౌస్ ను కొంత అన్ ఈజీగా ఫీల్ అవుతుంది.

PREV
15
Prema Entha Madhuram: ఆర్య ఇంట్లో జిండేకు అడ్డంగా బుక్కైన రాగసుధ.. ఆమె తలపై గన్ పెట్టి?

కానీ ఆర్య (Arya) .. ఒకసారి లోపలికి వెళదాం నచ్చకపోతే వెంటనే తిరిగి వెళ్ళిపోదాం అని చెబుతాడు. దానికి అను సరే అని గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లి చూడగా ఆ హౌస్ వేరే స్థాయిలో డెకరేట్ చేసి ఉంటుంది. ఆ డెకరేషన్ అను ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ సమయంలో అను (Anu)  లోపలికి పరిగెత్తుతూ ఆనందంతో ఉరకలు వేస్తుంది.
 

25

ఆ తర్వాత ఆర్య (Arya)  వాలెంటైన్స్ డే వీక్ మొత్తం ఇక్కడే గడపాలి అని అంటాడు. దాంతో అను ఎంతో ఆనంద పడుతుంది. ఇక ఆ రోజూ రోజ్ డే సందర్భంగా ఆర్య ఒక రోజ్ ని కూడా ఇస్తాడు. ఆ సమయంలో వాళ్ళు ప్రేమ మత్తులో వేరే స్థాయిలో చిల్ అవుతారు. మరోవైపు ఆర్య వాళ్ళ ఇంట్లో ఉన్న రాగ సుధ కు జిండే ఎదురు పడగా రాగసుధ (raga sudha) స్టన్ అవుతుంది.
 

35

ఇక జిండే (jinde) , రాగసుధ కు ఒక కథ ద్వారా ప్లాన్ ప్రకారం నిన్ను ఇక్కడికి రప్పించాను అని చెబుతాడు. ఆ మాటతో రాగ సుధ ఎంతో ఆశ్చర్యపోతుంది. ఆ క్రమంలోనే జిండే నిన్ను పైకి పంపించడానికి టికెట్ బుక్ చేసిందే.. ఆర్య కాబట్టి అను (Anu)  తో హ్యాపీ గా వాలెంటైన్స్ డే వీక్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి గెస్ట్ హౌస్ కి వెళ్ళాడు అని చెబుతాడు.
 

45

ఆ తర్వాత రాగసుధ ( Raga sudha) తల పై గన్ పెట్టి ఆర్య కు జిండే వీడియో కాల్ చేస్తాడు. దానికి ఆర్య లేట్ చేయకు జిండే కాల్చేయ్ అని చెబుతాడు. అలా వీడియో కాల్ మాట్లాడే క్రమంలో అను అక్కడికి వస్తుంది. ఇదంతా అను చూసేసింది ఏమో అని  అని ఆర్య (Arya) భయపడతాడు.
 

55

మరి రేపటి భాగంలో జిండే ( Jinde),  రాగసుధను కాలుస్తాడో.. లేక రాగసుధ( Raga sudha) , జిండే కళ్ళు కప్పి పారిపోతుందో తెలియాలి అంటే రేపటి భాగం కోసం ఎదురు చూడాల్సిందే.

click me!

Recommended Stories