Karthika Deepam: వంటలు చేస్తున్న కార్తీక్ ను చూసిన మోనిత.. కథలో కీలక మలపు?

Navya G   | Asianet News
Published : Feb 05, 2022, 08:52 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆదిత్య, కావ్యలు కారులో వెళుతూ మోనిత చేసిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు మోనిత, భారతి (Bharathi)లు బర్త్డే పార్టీ కి వెళుతూ ఉంటారు.

PREV
16
Karthika Deepam: వంటలు చేస్తున్న కార్తీక్ ను చూసిన మోనిత.. కథలో కీలక మలపు?

మరోవైపు కార్తీక్ (Karthik) , దీప  లు వంట చేయడానికి అంజలి ఇంటికి బయలు దేరుతారు. ఆ సమయంలో దీప ఎలా ఉండే డాక్టర్ బాబు ఎలా అయిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది దీప అని కార్తీక్ అడుగుతాడు. మీరు ఇలా వంట చేయడానికి రావడం నాకు నచ్చలేదు అని దీప (Deepa) చెబుతుంది.
 

26

ఆక్రమంలో కార్తీక్ (Karthik) , ఫన్నీ గా జోక్స్ వేస్తూ.. కార్తీక్ మాటలతో  దీప ఆలోచనను మార్చేస్తాడు. మరోవైపు డాక్టర్ అంజలి ఇంటికి మోనిత, భారతి లు వచ్చి ఆ ఇంటిని డెకరేట్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో మోనిత మెడలో మంగళసూత్రాన్ని  అంజలి (Anjali) చూసి మీకు పెళ్లి అయ్యిందా అని అడుగుతుంది.
 

36

దానికి మోనిత  (Monitha) అవును అవునండీ..  అని మోనిత సమాధానం చెబుతుంది. ఆ తర్వాత అంజలి మీ వారు ఏం చేస్తారు అని అడగగా..  తను కూడా డాక్టరే అని చెబుతోంది. అతనొక కార్డియాలజిస్ట్ అని చెబుతోంది. దానికి అంజలి (Anjali) అయితే మీ వారికి ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ తెలిసే ఉంటుంది అని అంటుంది.
 

46

దాంతో మోనిత (Monitha)  షాక్ అవుతుంది. ఈలోపు కార్తీక్ వాళ్ళు అంజలి ఇంటికి రానే వస్తారు. ఇక అంజలి వాళ్ల ను రిసీవ్ చేసుకుని వంట కార్యక్రమాలు మొదలు పెట్టిందని ఇంటి వెనకాల కు పంపిస్తుంది. తర్వాత మోనిత, అంజలికు డాక్టర్ కార్తీక్ (Karthik) నా భర్త అని చెబుతుంది. ఆ మాటతో ఆంజలి షాక్ అవుతుంది.
 

56

ఆ తర్వాత అంజలి (Anjali) , డాక్టర్ కార్తీక్ గారు మా హాస్పిటల్ కి వచ్చారు అని చెబుతుంది. దాంతో మోనిత కూడా ఆశ్చర్యపోతుంది. మరోవైపు కార్తీక్, దీప లు ఆనందంగా వంటలు చేసుకుంటూ ఉంటారు. ఇక కార్తీక అదే ఊర్లో ఉన్నడని తెలిసిన మోనిత (Monitha ) కు ఆనందానికి అవధులు ఉండవు.
 

66

ఆ తర్వాత అక్కడకు అంజలి (Anjali) వచ్చి మోనిత ను వంటల దగ్గర ఉప్పు, కారం సరిపోయిందో లేదో అని చూసి రమ్మంటారు. ఇక మోనిత వంటల దగ్గరికి వెళుతుంది. అలా వెళ్లగానే మోనిత అక్కడ వంటలు చేస్తున్న కార్తీక్  (Karthik)  ను చూసి స్టన్ అవుతుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories