రాధిక తండ్రి ఎంఆర్ రాధ
తమిళ సినీ నటుడు ఎంఆర్ రాధ జీవితం వివాదాలతో నిండి ఉంది. సినిమా, నాటకరంగం, రాజకీయాల్లో ఆయన చర్యలు తరచుగా సంచలనం సృష్టించాయి. తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన అద్భుత కళాకారుడు ఎంఆర్ రాధ. ఆయన వివాహం, ప్రేమ జీవితం గురించి తెలుసుకుందాం. ఎంఆర్ రాధ నాటక రంగంలో పనిచేసేటప్పుడు ప్రేమావతి అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఎం ఆర్ రాధాకి మొదటి భార్య.
ఎంఆర్ రాధ కుమార్తె రాధిక
వీరికి కుమారుడు జన్మించాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎంఆర్ రాధ తన భార్య, కొడుకుని మశూచి వ్యాధితో కోల్పోయారు. మొదటి భార్య మరణం తర్వాత ఎంఆర్ రాధ తన నాటకాల కోసం విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో చాలా మంది మహిళలతో ప్రేమలో పడ్డారు. తాను ప్రదర్శనలు ఇచ్చిన వివిధ పట్టణాలకు చెందిన సరస్వతి, ధనలక్ష్మి, జయమ్మాళ్లను వివాహం చేసుకుని వారితో కుటుంబాలను ప్రారంభించారు. ఆయా పట్టణాల్లో వారికి ఆస్తులు కూడా ఇచ్చారు.
ఎంఆర్ రాధ కుమార్తె రాధిక
సరస్వతి, ధనలక్ష్మి సోదరీమణులు కావడం గమనార్హం. ఎంఆర్ రాధ వారిద్దరితో కలిసి ఒకే ఇంట్లో నివసించేవారు. ఆయన ఐదో భార్య గీత శ్రీలంక తమిళ మహిళ. ఆమె ద్వారా ఆయనకు నిరోష, రాధిక అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. వీరు ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రముఖ నటీమణులుగా రాణిస్తున్నారు.
ఎంఆర్ రాధ 5 పెళ్లిళ్లు
మొదటి భార్య మరణం తర్వాత ఎంఆర్ రాధ మరో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. ముగ్గురు భార్యల ద్వారా 12 మంది సంతానం కలిగారు. ఆయన పిల్లలు ఎంఆర్ వాసు, రాజు, రాధా రవి, మోహన్, రాణి, రష్యా, రాధ, కనగవల్లి, రాజేశ్వరి, కాస్తూరి, నిరోష, రాధిక. రాధా రవి సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించగా.. రాధిక, నిరోష సినిమా, టెలివిజన్ రంగాల్లో తమదైన ముద్ర వేశారు. మోహన్ రాధ సినీ నిర్మాతగా రాణించారు. ఎంఆర్ రాధ మిగిలిన పిల్లలు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు.
ఇంత చేసినా ఎంఆర్ రాధకు సేలం మోడ్రన్ థియేటర్స్ నిర్మాణాలలో తనతో కలిసి నటించిన సహాయ నటి జ్ఞానం పట్ల మనసు పడింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసి మరో పట్టణానికి కిడ్నాప్ కూడా చేశారు. అయితే మోడ్రన్ థియేటర్స్ యజమాని తన మనుషులను పంపించి ఆ మహిళను రక్షించారు. ఈ సంఘటన కారణంగా ఎంఆర్ రాధ కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉండి నాటకాలపైనే దృష్టి సారించాల్సి వచ్చింది. కోలీవుడ్‌లో నిజ జీవిత మన్మథుడిగా పేరు తెచ్చుకున్న ఎంఆర్ రాధ 1979లో కామెర్లతో మరణించారు.