వేణు స్వామికి భారీ షాక్, అరెస్ట్ తప్పదా? 

First Published | Sep 13, 2024, 4:00 PM IST

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామిపై లీగల్ యాక్షన్ షురూ అయ్యింది. అతడిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. 
 

వేణు స్వామి చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అతనిపై కేసు నమోదు చేయాలని 17వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు వేణు స్వామి మీద విచారణ జరపాలని ఆదేశాలిచ్చింది. పిటిషనర్ టీవీ 5 మూర్తి వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 
 

Inaya Sulthana

వేణు స్వామి జాతకాల పేరిట ప్రజలను మభ్య పెడుతున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను మార్పింగ్ చేసి తప్పుదోవ పట్టించాడు. తన మోసాలను వెలుగులోకి తెచ్చిన తనపై వేణు స్వామి కుట్ర పన్నాడని టీవీ 5 మూర్తి పిటిషన్ లో పేర్కొన్నాడు. తనకు వేణు స్వామి హాని తలపెట్టాలని చూస్తున్నాడని టీవీ 5 మూర్తి పిటిషన్ లో పొందుపరిచారు. 
 


ఈ క్రమంలో వేణు స్వామిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నారు. ఇటీవల వేణు స్వామి దంపతులు ఒక వీడియో విడుదల చేశారు. సదరు వీడియోలో టీవీ 5 మూర్తి తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. టీవీ 5 మూర్తి వలన మాకు ప్రాణహాని ఉంది. మాకు రక్షణ కల్పించకపోతే ఆత్మహత్యే శరణ్యం.. అని వీడియోలో ఆవేదన చెందారు. 
 

అలాగే వేణు స్వామి దంపతులు ఒక ఆడియో కాల్ రికార్డు ఆ వీడియోలో వినిపించారు. ఆ ఆడియో కాల్ లో తమ వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం గురించే వ్యక్తులు మాట్లాడుకుంటున్నారని, తెలియజేశారు. వేణు స్వామి ఆరోపణలను టీవీ 5 మూర్తి ఖండించారు. తన బండారం బయటపెట్టినందుకే వేణు స్వామి ఈ నాటకానికి తెరలేపాడని కౌంటర్ ఇచ్చాడు. 
 

Prabhas


వేణు స్వామిపై టీవీ 5 మూర్తి లీగల్ యాక్షన్ కి సిద్దమయ్యాడు. తాజాగా కోర్టు వేణు స్వామి మీద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కాగా వేణు స్వామి నటులు, రాజకీయ నాయకుల జాతకాలు ఓపెన్ గా చెబుతూ వెలుగులోకి వచ్చాడు. ఆయన జ్యోతిష్యం వివాదాస్పద అంశాలతో కూడుకొని ఉంటుంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధపడేలా జాతకాల పేరిట వేణు స్వామి పరుష వ్యాఖ్యలు చేశాడు. 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఆగస్టు 8న శోభిత ధూళిపాళ్ల-నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన వేణు స్వామి.. వారిద్దరూ మూడేళ్ళ లోపే విడిపోతారు. జాతకాల ప్రకారం కలిసి జీవించే అవకాశం లేదు. నాగ చైతన్యకు సహజంగా పిల్లలు కూడా పుట్టరు, అన్నాడు. వేణు స్వామి కామెంట్స్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. 

మంచు విష్ణు తనకు ఫోన్ చేశాడని, ఇకపై సెలెబ్స్ జాతకాలూ చెప్పనంటూ అనంతరం వేణు స్వామి వీడియో వదిలాడు. గతంలో కూడా ఇదే మాట చెప్పిన వేణు స్వామి అది తప్పాడు. మరోవైపు వేణు స్వామి జాతకాలను, పూజలను నమ్మే టాలీవుడ్ సెలెబ్స్ ఉన్నారు. రష్మిక మందాన ఆయన భక్తురాలు కావడం విశేషం. 

Latest Videos

click me!