శ్రీలంకలో పుట్టి చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్ గా ఎదిగింది.. క్రేజీ హీరోయిన్ ఆస్తుల వివరాలు

First Published | Nov 20, 2024, 1:34 PM IST

తెలుగు తమిళ భాషల్లో ఒకప్పుడు రాధిక తిరుగులేని స్టార్ హీరోయిన్. ఆమె ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. 

రాధిక సినిమాలు, ఆమె ఆస్తి విలువ

Radhika Sarathkumar Net Worth : సినిమా నేపథ్యం ఉన్న రాధిక శరత్ కుమార్ నటిగా ఎదిగారు. నటుడు ఎం.ఆర్.రాధా, గీత దంపతుల కుమార్తె. ఎం.ఆర్.రాధా చెన్నైకి చెందిన వ్యక్తి. గీత శ్రీలంకకు చెందిన తమిళ మహిళ. ఇండియా, శ్రీలంక, లండన్‌లలో చదువుకున్న రాధిక చదువును మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి వచ్చారు.

రాధిక ఇల్లు, కార్ల కలెక్షన్

భారతీరాజా దర్శకత్వంలో రాధిక నటించిన తొలి చిత్రం 'కింజక్కె పోగుమ్ రైల్'. సుధాకర్ సరసన నటించిన ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ప్రతాప్ పోతన్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదిలోనే ఆయనకు విడాకులిచ్చి రిచర్డ్ హార్డీని రెండో వివాహం చేసుకున్నారు.

Latest Videos


రాధిక వ్యక్తిగత జీవితం, కెరీర్

రెండేళ్ల తర్వాత ఆయనకు విడాకులిచ్చి 2001లో శరత్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి  రాయనే హార్డీ అనే కూతురు ఉంది. ఆమె క్రికెటర్ అభిమన్యు మిథున్‌ను వివాహం చేసుకుంది. జాతీయ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు, తమిళనాడు రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. తమిళంతో పాటు మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ పనిచేశారు. నటిగానే కాకుండా నిర్మాత, దర్శకురాలిగానూ రాణించారు.

రాధిక తల్లిదండ్రులు, భర్త, కూతురు

సన్ టీవీలో ప్రసారమైన 'చిత్తి' సీరియల్‌ను రాధిక రాడాన్ మీడియా వర్క్స్ నిర్మించింది. ఈ సంస్థలో 51.42 శాతం వాటా ఆమెదే. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, ప్రమోటర్‌గా ఉన్నారు. సినిమా, టీవీ రంగాల్లో రాణించిన రాధిక రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున విరుదునగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

రాధిక కుమారుడు, ఇల్లు

తొలుత భర్త శరత్ కుమార్ పార్టీ అయిన అఖిల భారత సమత్వ మక్కల్ కట్చిలో, ఆ తర్వాత అన్నాడీఎంకే, చివరగా డీఎంకేలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. గత 17 ఏళ్లలో 4 పార్టీలు మారారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తి రూ.53.45 కోట్లు ఉందని పేర్కొన్నారు.

రాధిక ఆస్తి విలువ, సినిమాలు

ఇందులో రూ.33.01 లక్షలు, 750 గ్రాముల బంగారం, 5 కిలోల వెండితో కలిపి రూ.27,05,34,014 విలువైన చరాస్తులు, రూ.26,40,00,000 విలువైన స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. రూ.14.79 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు.తెలుగులో రాధికా మెగాస్టార్ చిరంజీవి సరసన అనేక చిత్రాల్లో నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దాదాపుగా అన్ని చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. అందుకే రాధికా చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్లలో ఒకరు.

click me!