`పుష్ప 2`కి ఫహద్‌ ఫాజిల్‌ పారితోషికం ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే? హీరోయిన్‌ కంటే కూడా

First Published | Nov 20, 2024, 12:14 PM IST

`పుష్ప 2` సినిమాలో హీరోహీరోయిన్ల పారితోషికాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో ఇందులో నెగటివ్‌ రోల్‌ చేసిన ఫహద్‌ ఫాజిల్‌ పారితోషికం తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. 
 

Fahadh Faasil

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుకుమార్‌ రూపొందించిన `పుష్ప 2` సినిమాకి సంబంధించిన చర్చనే ఎక్కువగా నడుస్తుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ట్రైలర్‌ వ్యూస్‌ పరంగానూ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. వరుసగా ప్రమోషన్స్ కార్యక్రమాలతో టీమ్‌ బిజీగా ఉండబోతుంది. ప్రధాన నగరాల్లో ఈవెంట్లు ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌, ఆర్టిస్ట్ ల పారితోషికాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ మూవీకి హీరో అల్లు అర్జున్‌ భారీగానే పారితోషికం తీసుకుంటున్నారట. రెండు వందల కోట్లకుపైగానే ఉండబోతుందని సమాచారం. అయితే ఇందులో కొంత క్యాష్‌ రూపంలో, కలెక్షన్లలో షేర్‌ రూపంలో ఉండబోతున్నాయని సమాచారం. 


మరోవైపు ఇతర ఆర్టిస్ట్ ల పారితోషికాలు కూడా ఆసక్తిని క్రియేట్‌ చేస్తున్నాయి. అందులో భాగంగా విలన్‌ పాత్రలో నటిస్తున్న మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ పారితోషికం లీక్‌ అయ్యింది. ఆయన ఈ మూవీకి ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే. `పుష్ప` సినిమాకి ఆయనకు మూడున్నర కోట్లు ఇచ్చారట. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. దీంతో పార్ట్ 2 అయిన `పుష్ప 2`కి బడ్జెట్‌ భారీగా పెరిగింది. సుమారు ఐదు వందల కోట్ల దాకా అయ్యిందని అంటున్నారు. 

బడ్జెట్‌ పెరగడానికి పారితోషికాలు పెరగడమే ఓ కారణంగా చెప్పొచ్చు. రెండో పార్ట్ కి ఫహద్‌ సుమారు ఎనిమిది కోట్ల వరకు తీసుకున్నారని సమాచారం. అన్ని కటింగ్స్‌ పోతే ఆయనకు 7.2కోట్లు వరకు ముట్టిందని సమాచారం. పలువురు క్రిటిక్స్ సైతం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఫహద్‌ కి ఆ పారితోషికం తక్కువేం కాదు, కానీ హీరోయిన్‌ కంటే తక్కువగా ఉండటం ఆశ్చర్యంగా మారింది.

ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తుంది. శ్రీవల్లిగా ఆమె మరోసారి రచ్చ చేసేందుకు వస్తుంది. అయితే ఈ రెండో పార్ట్ కిగానూ రష్మికకి పది కోట్లు పారితోషికం ఇస్తున్నారట. ఇదే నిజమైతే హీరోయిన్‌ కంటే ఫహద్‌ తక్కువ పారితోషికమే తీసుకుంటున్నారని చెప్పొచ్చు. 

అయితే మలయాళంలో పారితోషికాలు తక్కువగా ఉంటాయి. పైగా వీరికి తెలుగులో పెద్దగా పేరు లేదు కాబట్టి తక్కువ రెమ్యూనరేషన్స్ ఇస్తుంటారు. `పుష్ప 2` పెద్ద హిట్‌ అయితే ఫహద్‌ తెలుగులో బిజీ ఆర్టిస్ట్ అవుతాడు. అంతేకాదు హీరోగానూ ఆఫర్లు వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో ఫహద్‌ భన్వర్‌ సింగ్‌ షేకావత్‌గా, పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు. పుష్పరాజ్‌తో ఆయన ఫైటే రెండో పార్ట్ లో కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది.  

ఫహద్‌ మలయాళ పెద్ద స్టార్‌ అనే విషయం తెలిసిందే. దుల్కర్‌ సల్మాన్‌, వినిన్‌ పౌలీ, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తరహాలో మంచి ఇమేజ్‌, మార్కెట్‌ ఉన్న హీరో. ఇటీవల ఆయన మలయాళంలో చేసిన `ఆవేశం` సినిమా వంద కోట్లకుపైగా వసూలు చేసి అక్కడ బాక్సాఫీసుని షేక్‌ చేసింది. హీరోగా మలయాళంలో బిజీగా ఉన్నారు. అక్కడే కాదు తెలుగు, తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవల రజనీకాంత్‌తో `వేట్టయాన్‌` మూవీలో కీలక పాత్రలో నటించి అదరగొట్టిన విషయం తెలిసిందే. 

read more: ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లతో నటించి షేక్‌ చేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? పడిలేస్తున్న కెరటం

also read: ఫారెన్‌లో నాగార్జునకి చుక్కలు చూపించిన నయనతార, ఫోన్‌ వస్తే వణికిపోయేవారట.. ఆ బ్యాడ్‌ డేస్‌ని స్వయంగా చూశాడట
 

Latest Videos

click me!