యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ ని కోసాగిస్తూ ఎన్టీఆర్ దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దేవర చిత్రం 400 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. దీనితో పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ కి సపరేట్ మార్కెట్ ఏర్పడినట్లే అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
యమదొంగ చిత్రానికి ముందు ఎన్టీఆర్ చాలా పరాజయాలు చవిచూశారు. యమదొంగ తర్వాత ఫ్లాపుల పరంపర కాస్త తగ్గింది. అప్పుడప్పుడూ హిట్స్ కొడుతూ వచ్చాడు. టెంపర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ పరాజయం లేకుండా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర ఇలా వరుస హిట్లు దక్కాయి.
టెంపర్ చిత్రం క్రేజీ నిర్మాత బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కింది. అంతకంటే ముందు బండ్ల గణేష్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం బాద్షా. బాద్షా కూడా హిట్ అయింది. అయితే టెంపర్ సమయంలో ఎన్టీఆర్ కి, గణేష్ కి మధ్య విభేదాలు వచ్చాయి. దీని గురించి గణేష్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
నేను ఎన్టీఆర్ తో బాద్షా, టెంపర్ రెండు హిట్ చిత్రాలు చేశాను. బాద్షా చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది అయినా ఆ చిత్రానికి నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత కొందరి చెప్పుడు మాటలు విన్నా. అందువల్లే ఎన్టీఆర్ తో విభేదాలు వచ్చాయి. ఎన్టీఆర్ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. తప్పు నాదే అని తెలుసుకుని ఎన్టీఆర్ కి ఆయన ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పినట్లు బండ్ల గణేష్ తెలిపారు.
Bandla Ganesh
బాద్షాతో లాస్ వచ్చినప్పటికీ టెంపర్ చిత్రంలో నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి అని బండ్ల గణేష్ తెలిపారు. బండ్ల గణేష్ నిర్మాతగా రూపొందించిన చివరి చిత్రం టెంపర్. ఆ మూవీ తర్వాత గణేష్ మరో మూవీ చేయలేదు.