ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలను ఊపేసింది రాధిక. చిరంజీవి, రజినీకాంత్, బాలకృష్ణ, కృష్ణ, శోభన్ బాబు, విజయకాంత్, శరత్ కుమార్ లాంటి స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. ఇక హీరోయిన్ గా రాధికకు అవకాశాలు తగ్గిన టైమ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారపోయింది.
ఈక్రమంలో ఆమె బుల్లితెరకు జంప్ అయ్యారు. బుల్లితెరపై కూడా అదే స్టార్ డమ్ తో కొనసాగింది రాధిక. ఇది కథ కాదు, పిల్లి, చిట్టి, వాణి రాణి, లాంటి సీనియల్స్ లో నటించారు. ఆతరువాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది రాధిక. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో యంగ్ స్టార్స్ కు తల్లి పాత్రల్లో నటిస్తోంది.