
పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో తిరుగులేని టాప్ స్టార్‌గా ఎదిగినప్పటికీ ఆయన ఎప్పుడూ ఒక్క కమర్షియల్ యాడ్ కూడా చేయలేదు. ఇండియన్ సినిమాల్లో ఇలా కొందరు హీరోలు మాత్రం యాడ్స్ కి దూరంగా ఉన్నారు.
అదే సమయంలో మరికొందరు హీరోలు యాడ్స్ ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు. మహేష్ బాబు కూడా అందులో ఒకరు. టాలీవుడ్‌లో ఆయన చేస్తున్న యాడ్స్ మరెవ్వరూ చేయడం లేదు. ఓ రకంగా టాప్‌లో ఉన్నారని చెప్పొచ్చు.
యాడ్స్ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో పాలసీ, తాము వాడనివి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రొడక్ట్ లను ప్రమోట్ చేయలేమని పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, సాయిపల్లవి లాంటి కొందరు స్టార్స్ చెబుతుంటారు.
తాము వాడేవి, తమ రేంజ్‌ని బట్టి, బ్రాండ్, క్వాలిటీని బట్టి ప్రమోట్ చేస్తుంటామని మరికొందరు తారలు చెబుతుంటారు. అదే సమయంలో డబ్బుల కోసమే యాడ్స్ చేసేవారు కూడా ఉంటారు.
ఈ విషయంలో ఎవరి వాదన వారిదే. అయితే కొన్నిసార్లు పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన ప్రొడక్ట్ నెగటివ్ రిజల్ట్ ని ఇవ్వడంతో బ్లేమ్ అయిన సందర్బాలు కూడా ఉన్నాయి.
తాజాగా మహేష్ బాబుపై టాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తలుచుకుంటే మహేష్ బాబు కంటే నాలుగు రెట్లు సంపాదించగలరు అని, కానీ ఆ పని ఆయన చేయరని తెలిపారు.
ఈ విషయంలో మహేష్ బాబు కమర్షియల్ అని తెలిపారు. దర్శకుడు గీతా కృష్ణ ఏం చెప్పాడంటే `మహేష్ బాబు చాలా కమర్షియల్. ఒక్క సినిమా ఆడితే, రూ.20-30కోట్ల యాడ్స్ వస్తాయి.
అలానే ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ కి నాలుగు రెట్లు ఎక్కువొస్తాయి. కానీ నేను చేయను అని, చేస్తే ఫ్రీగా చేస్తానని, చేనేత వస్త్రాలు వంటి వాటికి అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ గురించి ప్రతి ఒక్కరు బ్యాడ్‌గా మాట్లాడేవారే. మంచి గుణాలను ఎవరూ చెప్పరు. సినిమాల్లో ఎంత సంపాదిస్తున్నాడో, దానికి మించి బయట సంపాదించవచ్చు మహేష్ బాబులాగా, కానీ ఒప్పుకోడు.
మహేష్ కి యాడ్ ఇన్‌కమ్ చాలా ముఖ్యం. మహేష్, ఆయన భార్య నమ్రత చాలా ప్లాన్ చేసి హిట్ అయ్యే సినిమాలే చేస్తారు. మూడేళ్లయినా రాజమౌళి మూవీని ఎందుకు చేస్తున్నారు ఆ తర్వాత యాడ్స్ పరంగా ఆయన ఎక్కడితో వెళ్తాడు` అని తెలిపారు దర్శకుడు గీతా కృష్ణ.
ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. గీతా కృష్ణ `సంకీర్తన`, `కీచురాళ్లు`, `కోకిల`, `కాఫీ బార్` వంటి చిత్రాలను రూపొందించారు.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఎస్‌ఎస్‌ఎంబీ29` చిత్రంలో నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా వంటి భారీ కాస్టింగ్‌తో ఇంటర్నేషన్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ రూపొందుతుంది.
ఇదిప్పుడు చిత్రీకరణ దశలో ఉంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. పారెస్ట్ నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచరస్‌గా ఈ మూవీ రూపొందుతుంది.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. మరోవైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే `హరిహర వీరమల్లు` మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 24న విడుదల కానుంది.
అలాగే `ఓజీ` సైతం షూటింగ్ పూర్తయ్యింది. ఇది సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఇప్పుడు `ఉస్తాద్ భగత్ సింగ్` సినిమా షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్. ఇది వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.