ఆ టైంలో గర్భవతిని, అయినా నిర్మాత షూటింగ్ లో దారుణంగా బిహేవ్ చేశాడు.. రాధికా ఆప్టే సంచలన ఆరోపణ

Published : Aug 07, 2025, 09:59 PM IST

తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఓ చిత్రంలో నటించాల్సి వచ్చిందని రాధికా ఆప్టే తెలిపింది. తాను గర్భవతిని అనే జాలి కూడా లేకుండా ఆ నిర్మాత తనతో దారుణంగా బిహేవ్ చేసినట్లు రాధికా ఆవేదన వ్యక్తం చేసింది. 

PREV
15
గర్భవతిగా ఉన్నప్పుడు రాధికా ఆప్టే కష్టాలు 

హీరోయిన్ రాధికా ఆప్టే గతేడాది తల్లి అయిన సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్‌లో ఆమె కుమార్తెకు జన్మనిచ్చారు. తాజాగా నేహా ధూపియా నిర్వహించిన ‘ఫ్రీడమ్ టూ ఫీడ్’ అనే లైవ్ సెషన్‌లో పాల్గొన్న రాధికా, ఇండియన్ ఎంటర్టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తల్లి అయ్యేందుకు మహిళలకు ఎదురయ్యే కష్టాలు, అవమానాల గురించి ఆమె వివరించింది. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఒక ఓ నిర్మాత తనతో ఎంత దారుణంగా బిహేవ్ చేశాడో అనే సంగతిని రాధికా ఆప్టే బయట పెట్టింది. 

DID YOU KNOW ?
రాధికా ఆప్టే తెలుగు చిత్రాలు
రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలయ్యతో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. 
25
దారుణంగా బిహేవ్ చేసిన నిర్మాత

 తాను గర్భవతిని అయిన విషయాన్ని తన దర్శకులు, నిర్మాతలకు తెలియజేశానని రాధికా ఆప్టే తెలిపింది. అందులో ఒక నిర్మాత మాత్రం అసహనం వ్యక్తం చేశాడని ఆమె అన్నారు. రాధికా ఆప్టే మాట్లాడుతూ.. “ఆ నిర్మాత తాను గర్భవతిని అయినా విషయాన్ని సున్నితంగా తీసుకోలేదు. నా శరీర మార్పులు, ఇబ్బందిని పట్టించుకోకుండా నన్ను షూటింగ్ లో బిగుతైన దుస్తులు ధరించమన్నాడు. నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా డాక్టర్‌ను కలవనివ్వలేదు. ఆ టైం లో ఎంతో వేదన అనుభవించా” అని రాధికా చెప్పారు.

35
సపోర్ట్ చేసిన హాలీవుడ్ డైరెక్టర్ 

ప్రెగ్నన్సీ సమయంలో తీసుకునే ఫుడ్ వలన నా శరీరంలో మార్పులు మొదలయ్యాయి. నా బాడీలో మార్పులని కూడా ఆ నిర్మాత అంగీకరించలేకపోయారు. అదే సమయంలో ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు ఎదురైన అనుభవాన్ని రాధికా పంచుకున్నారు.“ఆ హాలీవుడ్ దర్శకుడు ఎంతో సపోర్టివ్‌గా ఉన్నాడు. నేను ఎక్కువగా తింటున్నానని చెప్పినప్పుడు, ‘మీరు ఈ ప్రాజెక్ట్ చివరికి మరో వ్యక్తిలా కనిపించినా ఫర్వాలేదు, మీరు గర్భవతినయ్యారు కదా’ అని నవ్వుతూ అన్నాడు. ఆ మానవత్వం, ఆ సానుభూతి నాకు చాలా ఆనందాన్నిచ్చాయి.” అని రాధికా తెలిపారు.

45
రాధికా ఆప్టే వివాహం

రాధికా ఆప్టే 2012లో బ్రిటిష్ వయొలనిస్టు , కంపోజర్ బెనెడిక్ట్ టేలర్ను వివాహం చేసుకున్నారు. 2011లో లండన్‌లో ఉన్నప్పుడు ఇద్దరూ కలుసుకున్నారు. ఆ విధంగా ఏర్పడ్డ పరిచయంతో వీరిద్దరూ రియల్ లైఫ్ కపుల్ అయ్యారు. తాను గర్భవతిగా ఉన్నపుడు నిర్మాత నుంచి లగ్జరీ సౌకర్యాలు ఏమీ ఆశించలేదని.. కాస్త సానుభూతి మాత్రమే ఆశించానని రాధికా పేర్కొంది. 

55
రాధికా ఆప్టే తాజా సినిమాలు

రాధికా చివరిసారిగా ‘సిస్టర్ మిడ్నైట్’ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రం 2025 మే 30న ఇండియాలో విడుదలైంది. ప్రస్తుతం ఆమె ‘లాస్ట్ డేస్’ అనే ఆంగ్ల చిత్రంలో కనిపించనున్నారు. క్రైస్తవ మిషనరీ జాన్ ఆలెన్ చౌ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న ఈ బయోపిక్ చిత్రానికి జస్టిన్ లిన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో స్కై యాంగ్, నవీన్ ఆండ్రూస్, కెన్ లెంగ్, టోబీ వాలెస్, సియారా బ్రావో, క్లెయిర్ ప్రైస్ తదితరులు నటిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories