స్టార్‌ హీరోలకి వందల కోట్ల పారితోషికం.. సినీ వర్కర్ల రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా

Published : Aug 07, 2025, 09:31 PM IST

సినిమాకి ఒక్కో హీరో వందల కోట్ల పారితోషికం తీసుకుంటారు. మరి అదే సినీ వర్కర్లకి ఎంత పారితోషికం అందుతుందో తెలుసా? ఆ వివరాలను లెక్కలతో సహా తెలుసుకుందాం. 

PREV
16
టాలీవుడ్‌లో సినీ కార్మికుల వేతనాల గొడవ

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల వేతనాలకు సంబంధించిన చర్చ జరుగుతుంది. 30శాతం వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తోంది 24 క్రాఫ్ట్స్ కి చెందిన  ఫిల్మ్ ఫెడరేషన్‌. చివరగా 2022లో వేతనాలను సవరించారు. ప్రతి మూడేళ్లకి ఒకసారి ఈ వేతనాల సవరణ(పెంపు) ఉంటుంది. లేబర్‌ యాక్ట్ ప్రకారం తమకు 30శాతం వేతనాలు పెంచాలని కార్మికులు అడుగుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పెంచడం సాధ్యం కాదని నిర్మాతలు తెగేసి చెబుతున్నారు. చిన్న నిర్మాతలకు ఇది మోయలేని భారమని అంటున్నారు. దీంతో అటు సినీ కార్మికులకు, ఇటు ప్రొడ్యూసర్స్ కి మధ్య వివాదం నెలకొంది. ఇది షూటింగ్‌ల బంద్‌ వరకు వెళ్లింది.

DID YOU KNOW ?
అట్లీ మూవీకి బన్నీ పారితోషికం
అట్లీ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకి అల్లు అర్జున్‌ రూ.175కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట.
26
హీరోలకు వందల కోట్ల పారితోషికం, మరి సినీ కార్మికులకు

సినిమా రంగంలో అత్యధికంగా పారితోషికం తీసుకునేది హీరోలు. ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోలు ఏకంగా మినిమమ్‌గా రూ.100 కోట్ల నుంచి దాదాపు రెండు వందల కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. వారి మీదనే సినిమా నడుస్తుంది కాబట్టి ఆ రేంజ్‌లో డిమాండ్‌ చేస్తున్నారు. మరి సినిమాకి తెరవెనుక పనిచేసే మరి 24 క్రాఫ్ట్స్ లోని సినీ కార్మికులు ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది తెలుసుకుంటే.. హీరోకు, వర్కర్లకి మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది.  

36
సినీ కార్మికుల వేతనాల వివరాలు

సినీ కార్మికుల వేతనాలు చూస్తే, అసలు సినీ వర్కర్లకి కనిష్టంగా రూ.810, గరిష్టంగా రూ.1235 రోజువారి పారితోషికం ఇస్తున్నారు. ఇందులో ఔట్‌ డోర్‌లో ట్రావెల్‌ అలవెన్స్ లు వేరు. యాభై కిలోమీటర్లలోపు ఉంటే రూ.150అదనంగా ఇస్తారు. అదే యాభై కిలోమీటర్లకుపైగా ఉంటే రూ.120 ఇస్తారు. ఔట్‌ స్టేషన్‌ జర్నీ అలవెన్సులు రూ.485 ఉంటుంది. ఇలా ఒక్క రోజు లోకల్‌గా పనిచేస్తే పనిచేస్తే రూ.810 నుంచి 1500 వరకు పారితోషికం సినీ కార్మికులు అందుకుంటారు. దీంతోపాటు దూరాన్ని బట్టి ట్రావెల్‌ అలవెన్స్ ఉంటుంది. ఔట్‌ స్టేషన్‌లో అయితే మినిమమ్‌గా రూ.1300 నుంచి రూ.1700 వరకు సినీ కార్మికులకు అందుతుంది.

46
సినీ కార్మికులను మూడు గ్రేడ్లుగా విభజన

ఇందులోనూ మూడు గ్రేడ్లు ఉంటాయి. సీ గ్రేడ్‌ వాళ్ల(రోజు)కి రూ.810 ఉంటే, బి గ్రేడ్‌ వాళ్లకి రూ.1020, ఏ గ్రేడ్‌ వాళ్లకి రూ.1235 పారితోషికం ఇస్తారు. ఇది ఇప్పటి వరకు ఉన్న లెక్కలు. సీ గ్రేడ్‌లో జూ ఆర్టిస్ట్ లు వస్తారు. బి గ్రేడ్‌లో ప్రొడక్షన్‌ బాయ్స్ లాంటి వాళ్లు వస్తారు. ఏ గ్రేడ్‌లో టెక్నికల్‌ డిపార్ట్ మెంట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లు, లైట్‌మెన్స్, కాస్ట్యూమ్‌ డిజైనర్లు వంటి వారు ఏ కేటగిరిలోకి వస్తారు. ఇవన్నీ సింగిల్‌ కాల్షీట్లు. అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తే. సాయంత్రం 6 దాటితే డబుల్‌ కాల్షీట్‌ అవుతుంది.  రెండు పారితోషికాలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే మినిమమ్‌గా రూ.1600 నుంచి మాగ్జిమమ్‌గా రూ. 2500 వరకు ఇవ్వాలి. రాత్రి 9 దాటితే మూడో కాల్షీట్‌ వర్తిస్తుంది. అప్పుడు ఉన్న పారితోషికం త్రిబుల్‌ అవుతుంది. ఇలా జరిగితే సినీ కార్మికులకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది. అలవెన్స్ లు మాత్రం ఎన్ని కాల్షీట్లు అయినా సేమ్‌.

56
సినీ కార్మికులు డిమాండ్‌ చేస్తున్న కొత్త వేతనాలు

కొత్తగా డిమాండ్‌ చేస్తున్న పారితోషికాలు చూస్తే, సీ గ్రేడ్‌ వాళ్లకి రూ.1053, బీ గ్రేడ్‌ వాళ్లకి రూ.1326, ఏ గ్రేడ్‌ వాళ్లకి రూ.1606గా ఉన్నాయి. మిగిలిన అలవెన్సుల్లో మార్పు లేదు.  ఇవి తమకు భారంగా మారుతున్నట్టు నిర్మాతలు చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇక్కడే ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమయ్యింది. 

66
నెల మొత్తం పనిదొరకదు

ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే. ఈ వేతనాలు కార్మికులకు ప్రతి రోజు వర్క్ దొరికితే నష్టం లేదు, కానీ నెల మొత్తం పనిదొరకదు. గరిష్టంగా నెలకు 15 రోజులు దొరికితే ఎక్కువ. చాలా అరుదైన సందర్భంలోనే 20 రోజులు పనిదొరుకుతుంది. పైగా ఉన్న కార్మికుల్లో దాదాపు 50-60శాతం కార్మికులకు మాత్రమే రెగ్యూలర్‌గా పనిదొరుకుతుందని, మిగిలిన రోజులు ఖాళీగా ఉండాల్సిందే అని లైట్‌మెన్‌ యూనియన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ వెల్లడించారు. పని దొరికినప్పుడు వచ్చిన అమౌంట్‌తోనే నెలమొత్తం గడపాల్సి వస్తుందని, పనిదొరక్కపోతే కార్మికులకు ఇళ్లుగడవడం కష్టంగా ఉంటుందని వెల్లడించారు. అందుకే వేతనాలు డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. దర్శకుడు వీరశంకర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories