Radheshyam shocking Rate: డిజిటల్‌-శాటిలైట్‌ రైట్స్ లో దుమ్మురేతున్న `రాధేశ్యామ్‌` .. ఇండియన్‌ టాప్‌..

Published : Feb 03, 2022, 09:27 PM IST

`రాధేశ్యామ్‌`.. ప్రస్తుతం ఉన్న ఇండియన్‌ బిగ్గెస్ట్ మూవీస్‌లో ఒకటి. గ్లోబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తాజాగా డిజిటల్‌ రైట్స్ విషయంలో సంచలనంగా మారింది. భారీ రేటుకి అమ్ముడు పోయిందని టాక్‌. 

PREV
15
Radheshyam shocking Rate: డిజిటల్‌-శాటిలైట్‌ రైట్స్ లో దుమ్మురేతున్న `రాధేశ్యామ్‌` .. ఇండియన్‌ టాప్‌..

ప్రభాస్‌, పూజా హెగ్డే కలిసి నటించిన పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామా `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా నిర్మించాయి. కృష్ణంరాజు సమర్పకులు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించింది. మార్చి 11న విడుదల చేయాలని నిర్ణయించారు. థర్డ్ వేవ్‌ కరోనా అనంతరం వస్తోన్న బిగ్గెస్ట్ క్రౌడ్‌పుల్లర్‌ `రాధేశ్యామ్‌` కాబోతుండటం విశేషం. 

25

ఇతర సినిమాలు రిలీజ్‌ విషయంలో కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేస్తూ రెండు డేట్లు ప్రకటించి డబుల్‌ గేమ్‌ ఆడగా, ప్రభాస్‌ మాత్రం సింగిల్‌గా రంగంలోకి దిగారు. డేరింగ్‌ స్టెప్‌తో పెద్ద సినిమాల అందరి కంటే ముందే వస్తున్నారు. ఈ సినిమాపై `ఆర్‌ఆర్‌ఆర్‌` వంటి భారీ చిత్రాలు ఆశలు పెట్టుకోవడం విశేషం. అంతేకాదు బాలీవుడ్‌ మార్కెట్‌ పెంచడంలోనూ `రాధేశ్యామ్‌` మిగిలిన పాన్‌ ఇండియా చిత్రాలకు హెల్ప్ కాబోతుంది.

35

అయితే ఈ చిత్రానికి సంబంధించి భారీగా ఓటీటీ ఆఫర్‌ వచ్చిందని ఇంతకు ముందు ప్రచారం జరిగింది. ఏకంగా నాలుగు వందల కోట్లని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆఫర్‌ చేసిందని ప్రచారం జరిగింది. కానీ దాన్ని తిరస్కరించిన `రాధేశ్యామ్‌` టీమ్‌ థియేటర్లలోనే రాబోతున్నట్టు ప్రకటించారు. విజువల్‌ వండర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని థియేటర్‌లోనే చూస్తే ఆ కిక్కు వేరే లెవల్‌ అని వెయిటింగ్‌లో పెట్టారు. ఎట్టకేలకు మరో నెల రోజుల్లో ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతుంది. అయితే రిలీజ్‌ విషయంలోనూ భారీగా ప్లాన్ చేశారట. ఏకంగా ఇరవై వేల స్క్రీన్లలో ఈసినిమాని ప్రదర్శించేందుకు ప్లాన్‌ జరుగుతుందని టాక్. 

45

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి మరో గూస్‌బంమ్స్ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తాజాగా `రాధేశ్యామ్‌` డిజిటల్‌(ఓటీటీ), శాటిలైట్‌ రైట్స్ అమ్ముడు పోయాయని తెలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్(హిందీ), జీ5 సంస్థలు భారీగా వెచ్చించి ఈ రైట్స్ దక్కిచుకున్నాయట. అందులో భాగంగా `రాధేశ్యామ్‌` డిజిటల్-శాటిలైట్స్ రైట్స్  ఏకంగా 250కోట్లకి అమ్ముడుపోయాయని ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. 

55

ఈ విషయంలో `రాధేశ్యామ్‌` రికార్డ్ సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే డిజిటల్స్ రైట్స్ విషయంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` టాప్‌లో ఉంది. ఇది 325కోట్లకు సేల్‌ అయ్యింది. ఆ తర్వాత `రాధేశ్యామ్‌` నిలవడం విశేషం. దీంతో ఇప్పుడిది ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరోవైపు తమిళంకి సంబంధించిన థియేటర్‌ రైట్స్ కూడా కన్ఫమ్‌ అయ్యింది. రెడ్‌ గెయింట్‌ మూవీస్‌సంస్థ కోలీవుడ్‌ థియేట్రికల్‌ రైట్స్ ని భారీ మొత్తానికి దక్కించుకుందట. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories