యాంకర్ కమ్ యాక్ట్రస్ అనసూయ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అటు యాంకరింగ్ చేస్తూనే.. నటిగా కూడా బిజీ అవుతుంది. కెరీర్ బిగినింగ్ లో స్పెషల్ సాంగ్స్ వరకే పరిమితం అయిన అనసూయ, ఆతరువాత సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ కు షిప్ట్ అయ్యింది. అనసూయ టాలెంట్ కు మంచి మంచి పాత్రలు వచ్చి చేరుతున్నాయి ఆమె ఖాతాలో.