బ్లూ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న బాలయ్య భామ.. కుర్ర హీరోయిన్లకే షాకిస్తున్న స్నేహ అందాలు

Published : Feb 03, 2022, 06:03 PM ISTUpdated : Feb 03, 2022, 08:19 PM IST

స్నేహ.. ట్రెడిషనల్‌ అందాలకు కేరాఫ్‌. స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మెప్పించిన ఈ బ్యూటీ సెకండ్‌ ఇన్నింగ్స్ లో ఘాటు రేపుతుంది. ట్రెండీ ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌ని ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. 

PREV
16
బ్లూ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న బాలయ్య భామ.. కుర్ర హీరోయిన్లకే షాకిస్తున్న స్నేహ అందాలు

స్నేహ.. టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఏమాత్రం గ్లామర్‌ షోకి పోకుండా చీరకట్టులో, సాంప్రదాయ దుస్తుల్లోనే తెలుగు ఆడియెన్స్ ని కనువిందు చేసింది. గ్లామర్‌ అంటే స్కిన్‌ షో మాత్రమేకాదని, చీర అందాల్లోనూ హాట్‌నెస్‌ ఉంటుందని, చీరలోని అందాలను తెలుగు తెరపై ఆవిష్కరించి అలరించింది. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది. 

26

బలమైన పాత్రలు కలిగిన సినిమాలు చేసి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో బాలకృష్ణ(పాండురంగడు), నాగార్జున (శ్రీరామదాసు), రవితేజ(వెంకీ), వెంకీ(సంక్రాంతి) వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. హోంమ్లీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. 

36

అయితే తెలుగులో సెలక్టీవ్‌గా సినిమాలు చేసిన స్నేహ తమిళం, మలయాళంలో ఎక్కువ చిత్రాలు చేసింది. అడపాదడపా కన్నడలోనూ మెప్పించింది. నటుడు ప్రసన్నని వివాహం చేసుకుని కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది స్నేహ. 
 

46

కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ట్రెండీ వేర్‌లో కనువిందు చేస్తుంది. మోడ్రన్‌ డ్రెస్‌లో యమ హాట్‌గా కనిపిస్తుంది. హీరోయిన్‌గా చేసినప్పుడు కంటే ఇప్పుడే చాలా సెక్సీగా కనిపిస్తుంది స్నేహ. 

56

లేటెస్ట్ గా ఈ బాలయ్య బ్యూటీ బ్లూ ట్రెండీ వేర్‌లో కనువిందు చేసింది. కొంటె పోజులతో కవ్వింపులకు దిగింది. స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. దీంతో నెటిజన్లు ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేస్తున్నారు. కుర్ర హీరోయిన్లకు పోటీ నిస్తున్న స్నేహ అని, ఇలా అయితే యంగ్‌ హీరోయిన్లకి దేత్తడే అంటూ సెటైరికల్‌ కామెంట్లు చేయడం విశేషం. 

66

ఇక కెరీర్‌ పరంగా చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది స్నేహ. చివరగా ఆమె మూడేళ్ల  క్రితం తెలుగులో రామ్‌చరణ్‌ నటించిన `వినయ విధేయ రామ`లో మెరిసింది. ఇందులో కీలక పాత్రలో అలరించింది. ప్రస్తుతం `షాట్‌ బూట్‌ 3`అనే తమిళ సినిమాలో నటిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories