Big Boss Winner: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్ మందా. అతనికెలా తెలుసంటే...?

Published : Mar 15, 2022, 08:55 AM IST

బిగ్ బాస్ స్టార్ట్ అయ్యిందంటే చాలు.. చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. విన్నర్ పక్కాగా ఫలానా వాళ్లే అవుతారంటూ జ్యోసం చెపుతుంటారు. ఇక ఈసారి బిగ్ బాస్ విన్నర్ పక్కాగా  వాళ్లే అంటున్నాడు మాజీ విన్నర్ కౌశల్ మందా.

PREV
17
Big Boss Winner: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్ మందా. అతనికెలా తెలుసంటే...?

ఏడాదికి ఒక్క సీజన్ లో సందడి చేసే బిగ్ బాస్ కాస్తా ఓటీటీలో 24 గంటలు ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తోంది.  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాన్ స్టాప్ హంగామా అంటూ ఫస్ట్ టైమ్ ఓటీటీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది రీసెంట్ గా. 

27

వరుసగా మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన కింగ్ నాగార్జున ఈసారి కూడా బిగ్ బాస్ ఓటీటీ ని హోస్ట్ చేస్తున్నారు. పక్కగా షోను హ్యాండిల్ చేస్తూ.. అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఇప్పటికే షో స్టార్ట్ అయ్యి రెండు వారులు పైనే అవుతుంది. 
 

37

సరకొత్త వినోదానికి తెరలేపిన బిగ్ బాస్ నాన్ స్టాప్.. అదే విధంగా సాగుతోంది. ఇప్పటికి రెండు వారాలకు పైగా సందడి చేస్తున్న బిగ్ బాస్ లో ముమైత్ ఖాన్, శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఎప్పటికప్పుడు ఇంకా టైట్ గా మారుతూ..మాటల తూటాలు పేలుస్తూ.. హాట్ హాట్ గా జరుగుతోంది బిగ్ బాస్. 
 

47

ఈసారి పాత కొత్త కలయికతో స్టార్ట్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో విన్నర్ ఎవరు అన్నది ఇప్పుడే తెలియకపోయినా.. ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఈ విషయంలో ఎవరికి తోచిన జ్యోస్యం వారు చెపుతున్నారు. తాజాగా ఈ విషయంలో స్పందించారు మాజీ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మందా.. పక్కాగా విన్ అయ్యేది ఎవరో చెప్పేశాడు. 
 

57

తాజాగా బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షోపై ఆసక్తికర కామెంట్లు చేశాడు బిగ్‌బాస్‌ మాజీ విన్నర్‌ కౌశల్‌ మందా. బిగ్‌బాస్‌ షోలో ఎవరు గెలుస్తారన్నదానిపై  తన అంచనాలు ఎప్పుడూ తప్పలేదు అంటున్నాడు. ఈసారి బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌లో బిందుమాధవి గెలుస్తుంది. అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. 

67

బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించిన కొన్ని ప్రోమోలు చూశాను. అందులో బిందుమాధవి యాటిట్యూడ్‌, ఆమె సామర్థ్యాలు చూస్తే ఆవిడే గెలుస్తుంది అని చెప్తున్నాయి. రీ ఎంట్రీ ఇచ్చిన కొందరు కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌ గేమ్‌ను అర్థం చేసుకోవడంలో ఇప్పటికీ తడబడటం చూస్తుంటే నవ్వొస్తోంది  అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చాడు. 

77

బిగ్ బాస్ విన్నర్ విషయంలో ఎవరి అంచనాలు వారివి. ఎవరి జ్యోస్యాలు వారివి. ప్రతీసారి బిగ్ బాస్ విన్నర్ గురించి మాజీ విన్నర్స్.. మాజీ కంటెస్టెంట్స్ మాట్లాడటం కామన్. మరి నిజంగానే కౌశల్‌ మండా జోస్యం నిజమవుతుందా? లేదా? అనేది చూడాలి. 
 

click me!

Recommended Stories