అవును పెనిమిటి దేవమ్మను మీకు అప్పగిస్తాను అన్నాను కానీ ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదు అని అనుకుంటుంది.అప్పుడు మాధవ్ వీళ్ళ మాటలు అన్నీ విని, నాకు మంచి ఉపాయాన్ని ఇచ్చారు అని అనుకుంటాడు. మరోవైపు సత్య, అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది. కుటుంబం అంతా కనిపించడం లేదు మెసేజ్ చేద్దామా. వద్దు అక్కతో నేను స్వయంగానే మాట్లాడాలి, నిలదీయాలి పోనీ మాధవ్ కి మెసేజ్ చేద్దాము అని అనే లోగా మాధవ్ సత్య కు మెసేజ్ చేస్తాడు. ఏం పంపించాడు అని చూసేసరికి ఆదిత్య, రుక్మిణి మాట్లాడుకుంటూ ఉన్న ఫోటో ఉంటుంది.