Janaki Kalaganaledu: సొంత కుటుంబాన్ని బాధ పెడుతున్న మల్లిక.. జానకి, జ్ఞానాంబపై పగ?

First Published Oct 5, 2022, 12:21 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 5వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..జానకి తయారయ్యి బయటకు వస్తూ ఉండగా రామ పెద్ద కర్ర పట్టుకుని జానకిని ఆపుతాడు.ఏంటి రామ గారు ఈ కర్ర అని అనగా, తప్పడం లేదు జానకి గారు చిన్న పిల్లాడు హోమ్ వర్క్ రాయకుండా తప్పించుకుంటే టీచర్ ఎలా కర్ర పట్టుకుంటాదో నేను మిమ్మల్ని చదవడానికి అని అలా కర్ర పట్టుకోవాల్సి వస్తుంది. పనులు చేయొద్దని చెప్పాను కదా అని అనగా, అలా కాదు రామ గారు, మన కుటుంబ సాంప్రదాయంలో ఈ బొమ్మలకలువు అనేది చాలా ముఖ్యమైనది కదా ఇది అయిపోయిన వెంటనే నేను చదవడం మొదలుపెడతాను.
 

 ఇంకే పనులు చేయను ఇదే చివరిసారి,ఇది అయిన వెంటనే మీరు పుస్తకం తీయాలి అని అంటాడు. ఆ తర్వాత రామా  ఆటకెక్కి బొమ్మలు తీస్తూ ఉండగా జ్ఞానాంబ దూరం నుంచి రామాను చూస్తుంది. అదే సమయంలో అఖిల్ అక్కడికి వస్తాడు.ఇప్పుడు అన్నయ్య కి కనబడితే పని చేయమని చెప్తాడు, అది నా వల్ల కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అఖిల్ వెళ్లిపోవడం చూసి జ్ఞానాంబ బాధపడుతుంది. మల్లిక,విష్ణు ఏం చేస్తున్నారు అని చూడగా మల్లికా తింటూ ఉండగా, విష్ణు మల్లికకి బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. పాపం రామా ఒక్కడే ఇంటి బాధ్యతలను మోస్తూ ఉన్నాడు.
 

అందరూ వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు అని జ్ఞానాంబ అనుకొని నేను నీకు సహాయం చేస్తాను రామా అని అంటుంది. ఇంతలో జానకి అక్కడికి వచ్చి, ఆగండి అత్తయ్య గారు నేనున్నాను కదా మేము ఇద్దరం చేస్తాము అని అనగా, నీకు పరీక్షలు ఉన్నాయి కదా జానకి వెళ్లి చదువుకోవాలి అని జ్ఞానాంబ అంటుంది. లేదు అత్తయ్య గారు ఈ ఒక్క పూజ అయిపోయిన వెంటనే చదవడం మొదలు పెడతాను అని జానకి  అంటుంది. అప్పుడు మల్లికా అక్కడికి వస్తుంది. జానకి,రామ పనిచేయడం చూసి, ఇప్పుడు పోలేరమ్మ కనిపిస్తే నన్ను కూడా సహాయం చేయమని అంటుంది.
 

ఇక్కడ నుంచి చెక్కేయడం బెటర్ అని వెళ్ళిపోతుండగా జ్ఞానంబ మల్లిక ను చూస్తుంది.ఇంతలో జెస్సీ తయారయ్యి అక్కడికి వస్తుంది. ఆనందంగా అక్కడికి వెళ్దాం అనుకునే లోగా, మొన్న కూడా ఇలాగే అయింది తెలియని పండుగలకు నేను వెళ్తే అత్తయ్య గారు మళ్ళీ బాధపడతారు అని అనుకుంటుంది. ఇంట్లో వాళ్ళు అందరూ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు మల్లిక నీలావతి కి ఫోన్ చేసి, పెద్దమ్మ నేను చెప్పినట్టే మీరు పిల్లల్ని రానివ్వకుండా చేశారు కదా అని అడగగా, అవును మల్లిక, మీ పిల్లల్ని పంపిస్తే వాళ్ళు కూడా అఖిల్ లాగా ప్రేమ వివాహాలు చేసుకుంటారు ఏమో అని భయపెట్టేసాను.
 

ఒక్కడు కూడా అటువైపు రారు అని అంటుంది. చాలా ధన్యవాదాలు పెద్దమ్మ అని మల్లిక అనగా ధన్యవాదాలు కాదు నాకు పట్టుచీరలు పంపు అని నీలావతి అంటుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత మల్లికా గంతులు వేస్తూ ఉండగా పరంధామయ్య చూస్తాడు. ఏం చేస్తున్నావు అని అనగా, ఏమీ లేదు మావయ్య బొమ్మలు కదా ఆనందం వచ్చింది తట్టుకోలేక గంతులు వేసా అని మల్లిక అంటుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ చూస్తూ ఉండగా జానకి వీళ్ళు ఏంటి ఇంకా రాలేదు అని వాళ్లకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, మేము పంపించమమ్మా!మాకు అపచారం పడుతుంది అని అంటారు.
 

జానకి చాలా బాధపడుతుంది అప్పుడు మల్లిక, ఏమున్నది మొన్న ఇంటి వరకు వచ్చి వాయినాలు తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంటి వరకే రావడం లేదు. ఇంటికి శని పట్టినట్టు ఉన్నది అని అంటుంది. దానికి జానకి ఇంకా ఆపు మల్లికా అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ,మల్లిక చెప్పే తీరు తప్పు అయినా మల్లిక చెప్పేదే నిజం మొన్న అలాగే జరిగింది, ఇప్పుడు ఇలాగ జరిగింది.ఒకప్పుడు ముత్తైదువులు మన ఇంటికి రావాలంటే వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకోవాలి అని అందరూ అనుకునేవారు ఇప్పుడు ఎవరూ రావడం కూడా లేదు.నేను ముందే చెప్పాను బొమ్మలు కొలువు వద్దు ఇలా జరుగుతది అని కానీ మీరే బలవంతంగా పెట్టించారు.
 

 ఇంక నేను వెళ్ళిపోతాను అని లోపలికి వెళుతూ ఉండగా, ఒక చిన్న పిల్ల లంగా జాకెట్ వేసుకొని అక్కడికి వస్తుంది. అప్పుడు తను జానకి అక్క అని జానకి దగ్గరికి వెళ్లి హద్దుకునుంది. శ్రీ బాగున్నావా అని జానకి అంటుంది. ఎవరు ఈ పిల్ల ఎప్పుడూ మన చుట్టుపక్కల చూడలేదు అని రామా అనగా, తిన పేరు శ్రీ. ఒకరోజు స్కూల్ కి వెళ్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే నేనే వెళ్లి కాపాడి స్కూల్లో దింపాను. అప్పుడు నుంచి వీలైనప్పుడల్లా నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది అని అంటుంది జానకి. అయితే మీరు బొమ్మలకొలువుకు రమ్మని పిలిచారా జానకి గారు అని రామా అనగా, లేదు నేను పిలవలేదు అని జానకి అంటుంది.
 

ఏమైంది శ్రీ ఇలా వచ్చావు అని జానకి అనగా, మాకు దసరా సెలవులు ఇచ్చారు అక్క అలాగే నిన్ను చూసి వెళ్దాము అని అమ్మతో చెప్పి వచ్చాను అని అంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆనందపడగా మల్లిక మాత్రం,ఇంత కష్టపడి వేసిన ప్లాన్ తిరిగి కొట్టింది ఏంటి. ఈ యొక్క చిన్నదానివల్ల నా ప్లాన్ అంతా పాడైపోయింది అని అనుకుంటుంది. అప్పుడు జ్ఞానాంబ, ఒకప్పుడు మంచి చేస్తే ఎప్పుడైనా అది మనకు తిరిగి వస్తుందంటే ఇదేనేమో! ఎప్పుడో జానకి చేసిన మంచి ఇప్పుడు మన ఇంటికి బాలాత్రిపుర సుందరిగా తిరిగి వచ్చింది. అంతా అమ్మవారి దయ అని అనుకోని ఆ చిన్నపిల్ల చేత జానకి అమ్మవారి బొమ్మను బొమ్మలకు మధ్య ప్రతిష్టిస్తుంది.అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆనందిస్తారు. మల్లిక మాత్రం మొకం మాడుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!