మాధవీలతపై కేసు నమోదు.. సోషల్ మీడియా పోస్ట్‌పై వివాదం

Published : Aug 18, 2020, 07:39 AM ISTUpdated : Aug 18, 2020, 07:40 AM IST

ఇటీవల నటి, బీజేపీ నేత మాధవీ లత తరుచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ముఖ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది మాధవీ లత. తాజాగా ఆమె మీద రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్ పరిధితో కేసు నమోదైంది.

PREV
15
మాధవీలతపై కేసు నమోదు.. సోషల్ మీడియా పోస్ట్‌పై వివాదం

నటి మాధవి లత వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. తనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఏదో ఒక వివాదంలో తల దూర్చేసి కాంట్రవర్షియల్‌ కామెంట్స్‌తో రెచ్చిపోతోంది. రాజకీయాల్లోనూ సత్తా చాటాలనుకుంటున్న ఈ బ్యూటీ వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోతోంది.

25

గతంలో యామిని సాధినేని బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాధవి లత. మల్లెపూలు బాగా నలిపిందని పార్టీలోకి తీసుకున్నారా అంటూ ఈ భామ చేసిన కామెంట్స్‌ రాజకీయా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

35

మరో వివాదాస్పద నటి శ్రీరెడ్డితో మాధవి లత వివాదం చాలా కాలంగా సాగుతోంది. ఈ ఇద్దరు హద్దులు దాటి విమర్శించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అదే సమయంలో తనకు చచ్చిపోవాలని ఉంది అంటూ పోస్ట్ చేసి అభిమానుల్లో కలవరం కలిగించింది ఈ బ్యూటీ.

45

ఇటీవల లాక్‌ డౌన్‌ సమయంలో పెళ్లిళ్లు చేసుకుంటున్న సెలబ్రిటీలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాధవీ లత. `అస్సలు ఆగట్లేదుగా జనాలు మాస్కలు వేసుకొని పెళ్లిల్లు ఎందుకు అంటూ ప్రశ్నించింది. ముహూర్తం మళ్లీ రాదా..? ఇది పోతే శ్రావణం, కాకపోతే మాఘ మాసం లేకుంటే మరో వన్ ఇయర్..? సచ్చిపోతున్నార్రా నాయనా అంటే ఈ పెళ్లి ఏందో..? అంటూ కామెంట్ చేసింది.

55

ఇటీవల సోషల్‌ మీడియాలో హిందువుల మనోభావాలను కించపరిచేలా ఓ పోస్ట్ చేసిందంటూ మాధవీ లత మీద కేసు నమోదైంది. వనస్థలిపురంకు చెందిన గోపీ కృష్ణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె మీద 295-ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు సైబర్‌ క్రైమ్ పోలీసులు.

click me!

Recommended Stories