జాన్వీ కపూర్‌ పెళ్లిచేసుకోనుందా? ఇన్‌స్టా పోస్ట్‌తో అభిమానుల్లో అయోమయం

Published : Oct 25, 2025, 11:27 AM IST

Janhvi Kapoor Marriage : దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్  పెళ్లి చేసుకోబోతోందా?  తాజాగా జాన్వీ పెట్టిన  ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ద్వారా ఏం చెపుతోంది.  అభిమానులను గందరగోళానికి గురిచేసిన విషయం ఏంటి? 

PREV
15
శ్రీదేవి వారసురాలిగా..

 శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు జాన్వీ కపూర్.. శ్రీదేవి బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా మారితే.. జాన్వీ కపూర్ మాత్రం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. తన సొంత టాలెంట్ తో బాలీవుడ్ లో ఎదిగింది. కెరీర్ బిగినింగ్ లో కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లని జాన్వీ.. ప్రస్తుతం వాటి వెంటే పరుగులు తీస్తోంది. 

25
బాలీవుడ్ నుంచి సౌత్ కు

శ్రీదేవి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిన తరువాత  బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కానీ జాన్వీ కపూర్ ముందుగా బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న తరువాత సౌత్ లో అడుగు పెట్టింది. టాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీ.. ఎన్టీఆర్ జోడీగా దేవర సినిమాతో హిట్ కొట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్ జోడీగా పెద్ది సినిమాలో నటిస్తోంది. 

35
పాన్ ఇండియా హీరోయిన్ గా ..

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నం చేస్తోంది  జాన్వీ కపూర్. ఇప్పటికే  'దేవర' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన  జాన్వీ.. పెద్ది సినిమాతో మరో ముందడుగు వేసింది. రామ్ చరణ్ జోడీగా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. ఈ మూవీ తరువాత జాన్వీ కపూర్ దేవర 2 సెట్స్ లో జాయిన్ కాబోతోంది.  

45
శిఖర్ పహారియాతో ప్రేమ

జాన్వీ కపూర్ చాలా కాలంగా  శిఖర్ పహారియాను ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. శిఖర్ మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు. ఇద్దరూ చాలా సార్లు కలిసి డేటింగ్ కు వెళ్తూ..  కనిపించారు. విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు కూడా కలిసి చేస్తున్నారు. ఎన్నో సార్లు తిరుపతి లో కూడా సందడి చేసింది జంట. 

55
జాన్వీ పెళ్లి చేసుకోనుందా?

తాజాగా  జాన్వీ కపూర్ పెట్టిన  ఇన్‌స్టా స్టోరీ అభిమానులను అయోమయంలో పడేసింది. ఇన్ స్టా స్టోరీలో  "Save the date 29th Oct" అని  పోస్ట్ చేసింది జాన్వీ. దాంతో  ఫ్యాన్స్‌ కన్ఫ్యూజ్ అవుతున్నారు.  'పెళ్లి ప్రకటన ఏమైనా చేయబోతున్నారా అని  నెటిజన్లు జాన్వీని ప్రశ్నిస్తున్నారు?'  అసలు 29న ఏం జరగబోతోంది. జాన్వీ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందా? సేవ్ ద డేట్ అని ఎందుకు పోస్ట్ చేసింది.. అనేది తెలుసుకోవాలంటే అప్పటి వరకూ వేచి చూడాల్సిందే. 

Read more Photos on
click me!

Recommended Stories