ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎవరైనా. ఒక సారి మోసపోతారు. ఇమేజ్ పెరుగుతున్నా కొద్ది.. జాగ్రత్తగా ఉంటారు. కానీ పాత్ర విషయంలో రెండు సార్లు మోసపోయింది సీనియర్ నటి రాశి. 20 ఏళ్ల గ్యాప్ లో .. రాశి జీవితంలో జరిగిన రెండు సంఘటనలు ఏంటి?
చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టిన రాశీ.. ఆతరువాత కాలంలో హీరోయిగా మారి.. వెలుగు వెలిగింది. టాలీవుడ్ నుంచి హీరోయిన్లుగా ఎదిగిన అతి కొద్ది మంది తారల్లో రాశి ఒకరు. ఆమె కెరీర్ లో శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, గోకులంలో సీత, ప్రేయసి రావే, మనసిచ్చి చూడు, వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసింది. ఈ సినిమాలు రాశీకి మంచి ఇమేజ్ ను తీసుకొచ్చాయి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయి.
26
స్టార్ హీరోల సరన నటించిన రాశి
2002 వరకు రాశి కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగింది. ఆమె వరుసగా హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో కూడా రాశి నటించింది. శ్రీకాంత్, జగపతిబాబు, మోహన్ బాబు, బాలకృష్ణ, అజిత్, ఉపేంద్ర లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. పెళ్లి..పిల్లల తరువాత సినిమాలకు దూరం అయ్యింది రాశి. ఆతరువాత కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. యంగ్ హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తుంది.
36
నిజం సినిమాతో షాక్ ఇచ్చిన హీరోయిన్..
రాశి హీరోయిన్ గా సినిమాలు తగ్గిన టైమ్ నుంచి.. డిఫరెంట్ రోల్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఈక్రమంలోనే ఆమె తన పాత్రకు సబంధించిన విషయంలో.. రెండు సార్లు మోసపోయింది. 20 ఏళ్ల క్రిందట ఒక సారి. రీసెంట్ గా ఒక సారి రాశీ తన పాత్ర విషయంలో ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. 2003లో తన ఇమేజ్ కి పూర్తి భిన్నమైన రోల్ చేసింది .
అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న తేజ నిజం టైటిల్ తో ఓ మూవీ చేశారు. మహేష్ బాబు హీరోగా నటించారు. నిజం లో గోపీచంద్ విలన్ పాత్ర చేయగా.. గోపీచంద్ ప్రేయసి పాత్రలో రాశి నటించింది. హీరోయిన్ గా చేస్తున్న ఆమె నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ లో కనిపించి షాక్ ఇచ్చింది.
హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉన్న రాశి నుంచి అభిమానులు ఇలాంటి క్యారెక్టర్ ను ఊహించలేదు. రాశి మాట్లాడుతూ... నిజం మూవీలో మల్లి పాత్ర చేయడం వలన నేను విమర్శలు ఎదుర్కొన్నాను. నిజం మూవీలో గోపీచంద్ తో పరిమితికి మించి రొమాంటిక్ సీన్స్ లో నటించాను. దర్శకుడు తేజ నా పాత్ర విషయంలో మొదట చెప్పింది వేరు. తర్వాత తెరకెక్కించింది వేరు. ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశాను. మొదటి రోజే వచ్చేద్దామని అనుకున్నాను. కానీ అడ్వాన్స్ తీసుకోవడం వలన తప్పక నటించాను అని రాశీ అన్నారు.
56
పాత్ర విషయంలో రాశికి రెండో షాక్..
ఇక నిజం సినిమా రిలీజ్ అయిర 23 ఏళ్ల తరువాత మరోసారి తన పాత్ర విషయంలో మళ్లీ ఇలాంటి సందర్బాన్నే ఫేస్ చేసింది రాశి. తాజాగా తిరువీర్ హీరోగా నటించిన పాపం ప్రతాప్ సినిమాలో హీరో తల్లి పాత్రలో ఆమె నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో రాశి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో రాశి భర్తగా, తిరువీర్ తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ నటించారు.
రాశీ మాట్లాడుతూ.. ''నాకు ఇప్పటి ఆర్టిస్టుల పేర్లు తెలీదు. మనుషులను చూస్తే మాత్రం గుర్తుపడతాను. నాకు ఈ కథ చెప్పినప్పుడు నా భర్త పాత్ర అజయ్ ఘోష్ అని చెప్పారు. దీంతో నేను అజయ్(క్యారెక్టర్ ఆర్టిస్ట్) అనుకున్నాను. మొదటి రోజు సెట్ కి వెళ్తే అజయ్ యంగ్ గానే ఉంటాడు కదా నేను యంగ్ గా కనపడాలని జడ వేసుకున్నాను. డైరెక్టర్ వచ్చి నన్ను చూసి మీరు హీరోయిన్ లా ఉన్నారు మేడం, మదర్ లా కనిపించట్లేదు అంటే నన్నేమి చేయమంటారు అని అడిగా. హెయిర్ స్టైల్ లో చేంజ్ చేశారు.
66
అజయ్ అనుకుంటే అజయ్ ఘోష్ కనిపించారు..
నేను మేకప్ వేసుకుని సెట్ లోకి వెళ్తే అజయ్ గారు ఎక్కడా కనిపించలేదు. అజయ్ ఘోష్ గారు కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆయన్ని చూసి మా మామయ్య క్యారెక్టర్ ఏమో అనుకున్నా. అజయ్ కోసం చుట్టూ చూస్తుంటే ఒక అమ్మాయి వచ్చి ఏంటి మేడం వెతుకుతున్నారు అని అడిగింది. అజయ్ ఘోష్ ఎక్కడ అని చూస్తున్నా అంటే ఆయనే కదా అని కుర్చీలో కూర్చున్న అజయ్ ఘోష్ ని చూపించింది.
నేను షాక్ అయ్యాను.. వెంటనే డైరెక్టర్ ని అడిగాను, ఆయన పక్కన నేను ఎలా సెట్ అవుతాను అని. డైరెక్టర్ అప్పట్లో చిన్నప్పుడే పెళ్లిళ్లు అవుతాయి, పల్లెటూరిలో కాంబినేష్ ఇలానే ఉంటుంది అని ఏదో క్లారిఫికేషన్ ఇచ్చారు. సెట్ కి వచ్చాక ఇంకేం చేస్తాం, ఏమి చేయలేను. కానీ అజయ్ ఘోష్ గారు ఫెంటాస్టిక్ యాక్టర్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. చాలా కామెడీ పండిస్తారు'' అని తెలిపింది.