Shruti Haasan: నేను నీకు అమ్మనా..? ఏం వాగుతున్నావ్.. శ్రుతి హాసన్ కోపానికి కారణం ఏంటి? నెటిజన్లు ఏమంటున్నారంటే?

Published : Apr 21, 2026, 09:40 AM IST

మల్టీ టాలెంటెడ్ నటి, కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ పబ్లిక్‌గా ఓ వ్యక్తిపై  సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అతను చేసిన తప్పేంటి? శ్రుతీకి అంత కోపం ఎందుకు వచ్చింది? 

PREV
16
సీరియస్ అయిన శ్రుతీ హాసన్..

సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా, కెమెరాలు పట్టుకుని పాపరాజీలు వెంటపడటం కొత్తేమీ కాదు. కొందరు నవ్వుతూ పోజులిస్తే, మరికొందరు హద్దులు దాటితే సీరియస్ అవుతారు. తాజాగా.. మల్టీ టాలెంటెడ్ స్టార్..  కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ కూడా పబ్లిక్‌గా ఓ పాపరాజీపై ఫైర్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

26
శ్రుతీ హాసన్ ను అమ్మా.. అని పిలిచిన పాపరాజీ..
ఇటీవల ముంబైలోని ఓ హోటల్ నుంచి శ్రుతి హాసన్ బయటకు వస్తుండగా, ఫొటోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టారు. కారు వైపు నడుస్తున్న శ్రుతిని ఓ పాపరాజీ 'మమ్మా... మమ్మా...' అని పిలిచాడు. ఇది వినగానే శ్రుతి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ మారిపోయింది.
36
ఏం వాగుతున్నావ్.. అంటూ హీరోయిన్ ఫైర్..
వెంటనే ఆగిపోయిన శ్రుతి, 'ఎవరు మమ్మా? నేను నీ మమ్మానా? ఏం వాగుతున్నావ్? (Kaun hai mumma? Aapki mumma hai? Kya bak rahe ho tum?)' అని సీరియస్‌గా ప్రశ్నించింది. శ్రుతి కోపం చూసి ఫొటోగ్రాఫర్లు షాక్ అయ్యారు.
46
నెటిజన్లు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటే?

'ఇన్‌స్టంట్ బాలీవుడ్' షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. చాలామంది శ్రుతి హాసన్‌కు సపోర్ట్ చేస్తున్నారు. 'సంబంధం లేని నటీనటులను ఇలా పిలవడం తప్పు. వారికి గౌరవం ఇవ్వాలి' అని కామెంట్స్ చేస్తున్నారు.మరో యూజర్ అయితే 'ఆమె నీకు అమ్మ అవుతుందా? ఎందుకలా పిలుస్తావ్?' అని పాపరాజీని ప్రశ్నించాడు.

56
శ్రుతీ హాసన్ సినిమాలు సంగతేంటి?

అయితే, కొందరు నెటిజన్లు మాత్రం 'దీనికింత కోపం అవసరమా? ప్రేమతో పిలిచి ఉండొచ్చు కదా' అంటూ శ్రుతి రియాక్షన్ కాస్త ఓవర్ అని అభిప్రాయపడ్డారు.కెరీర్ విషయానికొస్తే, శ్రుతి ప్రస్తుతం ఫుల్ బిజీ. రజినీకాంత్ 'కూలీ'లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌తో 'ఆకాశంలో ఒక తార' సినిమాలోనూ నటిస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ప్రభాస్ 'సలార్: పార్ట్ 2'లో కూడా శ్రుతి హీరోయిన్‌గా సందడి చేయనుంది.

66
సోషల్ మీడియాలో మొదలైన చర్చ..

మొత్తం మీద, శ్రుతి హాసన్ 'మమ్మా' వివాదం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సెలబ్రిటీల ప్రైవసీ, గౌరవం గురించి మరోసారి చర్చ మొదలైంది. అంతే కాదు సెలబ్రిటీల తీరుపై కూడా పెద్ద చర్చే నడుస్తోంది. వారు కూడా నోరు జారకుండా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం వెల్లడౌతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories