హాట్‌ పోజులతో రెచ్చిపోయిన రాశీఖన్నా.. టెంప్టింగ్‌ పోజులు, మత్తెక్కించే చూపులతో రచ్చ చేస్తున్న హాట్‌ బ్యూటీ..

Published : Aug 12, 2022, 07:59 PM ISTUpdated : Aug 12, 2022, 11:00 PM IST

రాశీఖన్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా రోజులవుతున్నా, ఇంకా సెకండ్‌ లెవల్‌ హీరోలకే పరిమితమవుతూ వస్తోంది. దీంతో ఇక లాభం లేదనుకుందో ఏంటో గ్లామర్‌ సైడ్‌ మరింతగా ఓపెన్‌ అవుతూ వస్తోంది రాశీఖన్నా.   

PREV
16
హాట్‌ పోజులతో రెచ్చిపోయిన రాశీఖన్నా.. టెంప్టింగ్‌ పోజులు, మత్తెక్కించే చూపులతో రచ్చ చేస్తున్న హాట్‌ బ్యూటీ..

రాశీఖన్నా(Raashi Khanna) సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గానే ఉంటుంది. ట్రెండ్‌ని ఫాలో అవుతూ నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం లేటెస్ట్ ఫోటో షూట్‌తో మరోసారి మెరిసింది. ఇప్పుడు అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది. ట్రెండీ వేర్‌లో హోయలు పోతూ మతిపోగొడుతుంది రాశీ. 
 

26

అందాల రాశీ ట్రెండీ వేర్‌లో విరహాలు పోతూ పోజులిచ్చింది. హాట్‌ లుక్‌లో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. చూపుల్లో కసి, పోజుల్లో విరహంతో మత్తెక్కిస్తుంది. నెటిజన్ల చూపుతిప్పుకోనివ్వడం లేదు. దీంతో ఈ అమ్మడి రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. రాఖీ పండగ వేళ ఇలా నిండైన దుస్తుల్లో సెగలు రేపుతుండటం విశేషం.  Raashi Khanna Hot Pics.
 

36

ప్రస్తుతం రాశీఖన్నా నయా ఫోటో షూట్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. అదే సమయంలో నెటిజన్లు కూడా హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. రాశీ అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 
 

46

మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన రాశీఖన్నా `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ మదినిదోచుకుంది. క్యూట్‌ లుక్‌లో కట్టిపడేస్తుంది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది. అంతకు ముందే `మనం`లో చిన్న కోమియో చేసింది రాశీ. 
 

56

ఆ తర్వాత `జోరు`, `జిల్‌`, `శివం`, `బెంగాల్‌ టైగర్‌`, `సుప్రీమ్‌`, `హైపర్‌`, `జై లవ కుశ`, `విలన్‌`, `టచ్‌ చేసి చూడు`, `తొలి ప్రేమ`, `శ్రీనివాస కళ్యాణం`, `వెంకీ మామ`, `ప్రతి రోజు పండగే`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `పక్కా కమర్షియల్‌`, `థ్యాంక్యూ` చిత్రాల్లో నటించింది. ఇందులో ఆరు సినిమాలే విజయం సాధించాయి. పెద్ద స్టార్లలో కేవలం ఎన్టీఆర్‌తోనే చేసింది రాశీ. 
 

66

ఇటీవల ఆమె నటించిన `పక్కా కమర్షియల్‌`, `థ్యాంక్యూ` చిత్రాల పరాజయాలతో గట్టి దెబ్బ పడింది. ప్రస్తుతం ఆమె తమిళంలో `సర్దార్‌`తోపాటు `థిరుచిత్రంబలం` హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `యోధ` చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories