విడుదలకు అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ‘లైగర్’ నుంచి ఇటీవల వచ్చిన సాంగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా చిత్రం నుంచి ‘కోకా 2.0’ సాంగ్ వచ్చింది. గతంలోని అప్డేట్స్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీలో రూపొందిన మూవీని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.