Anasuya: భర్తతో కలిసి ముద్దు పోజులతో రెచ్చిపోయిన `జబర్దస్త్` యాంకర్.. నెటిజన్ల షాకింగ్‌ కామెంట్లు

Published : Aug 12, 2022, 05:39 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయకి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరే తెలుగు యాంకర్‌కి ఈ రేంజ్‌ ఫాలోయింగ్‌ లేదని చెప్పాలి. ఆమె అందాలతో చేసే విందు ఆ స్థాయిలో ఫిదా చేస్తుంటుంది.   

PREV
17
Anasuya: భర్తతో కలిసి ముద్దు పోజులతో రెచ్చిపోయిన `జబర్దస్త్` యాంకర్.. నెటిజన్ల షాకింగ్‌ కామెంట్లు

అనసూయ(Anasuya) లేటెస్ట్ గా ఫ్యాన్స్  మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఆమె పంచుకున్న ఫోటో ఆ స్థాయిలో మతిపోగొడుతుంది. అంతేకాదు నెటిజన్ల కామెంట్లకి తావిస్తుంది. సోషల్‌ మీడియాలో ఇప్పుడు అనసయ ఫోటో రచ్చ లేపుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం ఇందులో ఆమె ఇచ్చిన చిలిపి పోజే. అదేంటో చూస్తే.
 

27

Anasuya Bharadwaj తాజాగా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ సెల్ఫీ పిక్‌ని పంచుకుంది. ఇందులో తన భర్త శాశంక్‌ తో కలిసి అనసూయ ముద్దు ఇస్తున్నట్టుగా ఉన్న పోజు ఇది. కారులో వెళ్తూ వీరిద్దరు సరదాగా ఈ ముద్దు పోజుని సెల్ఫీలో బంధించి ఇస్టాగ్రామ్‌లో పంచుకున్నారు. క్యాప్షన్‌ లేకుండా షేర్‌ చేసిన ఈ ఫోటో నెటిజన్ల కంట పడింది. దీంతో వారిద్దరు రెచ్చిపోతున్నారు. 

37

రాఖీ పండుగ సందడి వీరిలో కనిపిస్తుంది. ఆ సరదా ఫీలింగ్‌లో కలిసి ప్రయాణిస్తున్న క్రమంలో ఇలా చిలిపిగా రెచ్చిపోయారు. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు అనసూయ ఫోటోపై స్పందిస్తున్నారు. ముద్దు కోసం అనసూయ తహతహ అని, పక్కనే భర్త ఉండగా అదేం చిలిపి పని అంటూ సెటైర్లు వేస్తున్నారు. సరదాగా ఆటపట్టిస్తున్నారు. 

47

జనరల్‌గా అనసూయ చాలా సందర్భాల్లో ట్రోల్స్ కి, విమర్శలకు గురవుతుంటుంది. ఆమె వేసుకునే దుస్తులపై నెటిజన్లు విరుచుకుపడుతుంటారు. ఏదో రూపంలో కామెంట్లు చేస్తుంటారు. ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయావా అనసూయ అంటూ చాలా సందర్భాల్లో ఆమెని ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. 
 

57

ఈ విమర్శలు అనసూయకి కామనే కానీ శృతి మించితే మాత్రం ఆమె రియాక్ట్ అవుతుంది. గట్టిగానే సమాధానం చెబుతుంది. నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా స్పందిస్తుంది. ట్రోలర్స్ నోళ్లు మూయిస్తుంటుంది. అయితే ఎన్నిసార్లు ఇలా జరిగినా, మళ్లీ రిపీట్‌ అవుతూనే ఉంటుంది. 
 

67

ఇంకా చెప్పాలంటే అనసూయపై కామెంట్లు చేయకుండా నెటిజన్లు ఊరుకోరు, వారికి కౌంటర్‌ ఇవ్వకుండా అనసూయ ఉంది. ఈ క్రమంలో జరిగే సంఘర్షణ, కన్వర్జేషన్‌ సోషల్‌ మీడియాకి కావాల్సిన స్టఫ్‌నిస్తుందని చెప్పొచ్చు. దీన్ని చాలా వరకు ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌గానూ భావిస్తుంటారు. కొద్దిసేపు ఎంజాయ్‌ చేస్తుంటారు. 

77

 జబర్దస్త్ యాంకర్‌గా పాపులర్‌ అయిన అనసూయ జబర్దస్త్ ని మానేసిన విషయం తెలిసిందే. ఆమె స్టార్‌ మాలో `సూపర్‌ సింగర్‌ జూనియర్స్` కి సుడిగాలి సుధీర్‌తో కలిసి హోస్ట్ గా చేస్తుంది. వీరిద్దరు కలిసి చేసే రచ్చ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మరోవైపు రవితో కలిసి మరో స్పెషల్‌ షో చేస్తుంది. అలాగే సినిమాల్లోనూ బిజీగా ఉంది అనసూయ. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆమె ఫుట్‌ బిజీ అయ్యింది.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories