Kiccha Sudeep Daughter: తన గాత్రంతో ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్న కిచ్చా సుదీప్ కూతురు శాన్వికి నటనపై కూడా ఆసక్తి ఉంది. కూతురి సినిమా ఎంట్రీ గురించి సుదీప్ మాట్లాడుతూ, ఆమెకు నటనపై పూర్తి ఆసక్తి ఉందని, కూతురి ఎంట్రీ గురించి ఏమన్నారంటే?
కిచ్చా సుదీప్ కూతురు శాన్వి సుదీప్ గాత్రానికి అభిమానులు ఫిదా అయ్యారు. జీ కన్నడ 'సరిగమప' స్టేజీఫై 'అప్పా ఐ లవ్ యూ పా' అని పాడి ఆకట్టుకుంది. కొన్ని నెలల క్రితం గాయనిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.నాని హిట్ 3 చిత్రంలో ఆమె పాట పాడింది.
26
శాన్వి సుదీప్ సినిమా ఎంట్రీ?
ఇప్పుడు సుదీప్ కూతురు శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయంపై సుదీప్‌ను ప్రశ్నించగా, ఓ ఇంటర్వ్యూలో కిచ్చా ఈ విషయాన్ని వెల్లడించారు.
36
సినిమా రంగంలోకి రావచ్చు
ఆమె కచ్చితంగా సినిమా రంగంలోకి రావచ్చు. ఆమెకు నటనపై 100% ఆసక్తి ఉంది. ఆమెకు ఇష్టమై, సెలెక్ట్ అయి, సినిమా అవకాశం వస్తే, ఇండస్ట్రీలోకి రావడానికి మాకేం అభ్యంతరం లేదు అని సుదీప్ చెప్పారు.
ప్రస్తుతం ఇంట్లో దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఆమెకు తన సొంత ఆశలు ఉంటాయి. ఇలాగే చేయమని మనం చేయి పట్టుకుని నడిపించలేం. తండ్రిగా ఆమెకు సపోర్ట్ చేస్తాను అంతే అని శాన్వి గురించి సుదీప్ చెప్పారు.
56
ఆమే జీవితాన్ని గడపాలి
ఆమే జీవితాన్ని గడపాలి, ఆమే పడాలి, ఆమే లేవాలి. ఆమెకు తెలియాల్సింది ఒక్కటే. ఆమె వెనుక మేమున్నామని. ఏదైనా తప్పు జరిగితే మేమున్నామనే భరోసా ఆమెకు ఉండాలి అంతే అన్నారు.
66
బలంగా తయారు చేయాలి
ఒక అమ్మాయిగా, నా కూతురిగా ఆమెను మేము బలంగా తయారు చేయాలి. కానీ మాపైనే ఆధారపడాలని కాదు. ఆమెకు ఏది ఇష్టమో అది చేస్తుంది, మేము సపోర్ట్ గా నిలుస్తాం అని కిచ్చా చెప్పారు.