రాయల్ లుక్ లో రాశీ ఖన్నా.. మ్యాగజైన్ కోసం వోణీ తీసేసి మరీ ఫోజులు.. బ్యూటీఫుల్ పిక్స్

First Published | Sep 29, 2023, 2:12 PM IST

గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా లేటెస్ట్ లుక్ తో కట్టిపడేస్తోంది. సోషల్ మీడియాలో పంచుకున్నఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. రాయల్ గా మెరిసి మంత్రముగ్ధులను చేసింది. 
 

యంగ్ బ్యూటీ  రాశీ ఖన్నా (Raashi Khanna)  ‘మనం’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇందులో క్యామియో అపియరెన్స్ ఇచ్చిన తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. అంతకుముందే ‘మద్రాస్ కేఫ్’తో హిందీలో నటిగా వెండితెరపై అడుగుపెట్టింది.
 

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరపై మెరిసింది. అప్పటి నుంచికొన్నేళ్ల పాటు టాలీవుడ్ లోనే సందడి చేసింది. యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. 
 


‘జిల్’, ‘బెంగాల్ టైగర్’, ‘హైపర్’, ‘జై లవ కుశ’, ‘తొలిప్రేమ’, ‘ప్రతి రోజూ పండగే’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. మరిన్ని సినిమాలతో నూ ఆడియెన్స్ ను అలరించింది. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
 

లెహంగాలో రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. కిల్లింగ్ సిట్టింగ్ ఫోజులతో కట్టిపడేసింది. గ్లోబల్ స్పా ఇండియా అనే మ్యాగజైన్ కోసం ఈ ముద్దుగుమ్మ ఇలా ట్రెడిషనల్ లుక్ లో ఫొటోషూట్ చేసింది. బ్యూటీఫుల్ గా మెరిసి మంత్రముగ్ధులను చేసింది.
 

చివరిగా తెలుగులో ‘థ్యాంక్యూ’ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత హిందీలో బిజీ అయ్యింది. బాలీవుడ్ లో వచ్చిన ‘ఫర్జీ’ సిరీస్ తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘తిరు’, ‘సర్దార్’, చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం హిందీలో ‘యోదా’, తమిళంలో ‘అరన్మణై 4, మేథావి’ చిత్రాల్లో నటిస్తోంది. 

Latest Videos

click me!