కొత్త షో కోసం అరియానా మెరుపులు.. అందంతో కట్టిపడేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ రచ్చ

First Published | Sep 29, 2023, 12:49 PM IST

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ వరుస షోలతో బుల్లితెరపై సందడి చేస్తోంది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ లుక్స్ తో మెరుస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ (Ariyana Glory) బుల్లితెరపై పలు షోలతో సందడి చేస్తూ వస్తోంది. తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’తో వచ్చిన క్రేజ్ సరిగా వినియోగించుకుంటోంది. స్మాల్ స్క్రీన్ పై అవకాశాలు అందుకుంటోంది.
 

Bigg Boss Telugu సీజన్ 4, ఓటీటీలో ఈ ముద్దుగుమ్మ  సందడి చేసింది. హౌజ్ లో తనదైన శైలిలో టాస్క్ లు ఆడి బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. రెండు సార్లు హౌజ్ లో మెరిసి మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం పలు షోలతో సందడి చేస్తోంది.


బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక అరియానా గ్లోరీ ‘బీబీ కెఫే’, ‘బీబీ జోడీ’ డాన్స్ షోలో అలరించింది. ఇక తాజాగా మరో రియాలిటీ షోలో మెరవబోతోంది. zee Telugu లో ప్రసారం కానున్న లేటెస్ట్ షోకోసం నయా లుక్ లో మెరిసింది. 
 

Telugu medium i School పేరిట జీతెలుగులో కొత్త రియాలిటీ షో ప్రసారం కానుంది. రెండ్రోజుల కింద హైదరాబాద్ లో షోను గ్రాండ్ గా లాంచ్ చేశారు. సన్నీలియోన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈవెంట్ లో సందడి చేశారు. 
 

షోకు సంబంధించిన డిటేయిల్స్ త్వరలో రానున్నాయి. ఈ క్రమంలో అరియానా గ్లోరీ తన కొత్తషో కోసం సరికొత్త అవుట్ ఫిట్ లో మెరిసింది. నయా లుక్ తో కట్టిపడేసింది. కిర్రాక్ ఫోజులతో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఇన్ స్టా వేదికన పంచుకుంది. 

పర్పుల్ కలర్ బాడీ కాన్ అవుట్ ఫిట్ లో అట్రాక్ట్ చేసింది. బొద్దుగా మారిన ఈ ముద్దుగుమ్మ తన లుక్స్ తో కట్టిపడేసింది. ఒంపుసొంపులతో మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన వీడియోలు, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

Latest Videos

click me!