తెలుగు సినిమా చేస్తున్న సోనాక్షి సిన్హా! హీరో ఎవరంటే ?

Published : Mar 04, 2025, 07:53 AM ISTUpdated : Mar 04, 2025, 07:55 AM IST

 Sonakshi Sinha: గతంలో  సోనాక్షి గతంలో బాలకృష్ణ సరసన ఒక సినిమాలో చెయ్యాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆమె నో చెప్పింది. అలాగే మెగాస్టార్ సరసన “ఆచార్య”లో మొదట ఆమెని తీసుకోవాలనుకున్నారు. 

PREV
14
 తెలుగు సినిమా చేస్తున్న సోనాక్షి సిన్హా! హీరో ఎవరంటే ?
Sudheer Babu Jatadhara Finds Its Leading Lady in Sonakshi Sinha in telugu


 Sonakshi Sinha: బాలీవుడ్ దృష్టి ఇప్పుడు సౌత్ పరిశ్రమపై పడింది. ఇక్కడ ఆఫర్స్ ని వారు రిజెక్ట్ చేయటం లేదు. ఇప్పటికే బాబీ డయోల్ ,సంజయ్ దత్ వంటివారు ఇక్కడ పాతుకుపోయే పనుల్లో ఉన్నారు.

అలాగే అక్కడ హీరోయిన్స్ దీపిక వంటి వారు సైతం తెలుగు సినిమాలు చేస్తున్నారు. అమితాబ్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ‘దబాంగ్’ మూవీతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి సిన్హా చేరనుంది. 
 

24
Sudheer Babu Jatadhara Finds Its Leading Lady in Sonakshi Sinha in telugu


మొదటి చిత్రంతోనే తన నటనతో, తన అందంతో సోనాక్షి సిన్హా మంచి ఫేమ్ నేమ్ సంపాదించుకుంది. అయితే, ఆ తర్వాత కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ అఖిరా, లుటేరా, ఫోర్స్ 2 లాంటి చిత్రాల్లో పెర్ఫార్మెన్స్ రోల్స్‌ తో అలరించింది.

కానీ ఆ సినిమాలేవీ ఆమెకు కలిసి రాలేదు. దీంతో సోనాక్షి సిన్హా కెరీర్ కాస్త స్లో అయింది. ఈ లోపు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుంది. అయితే బాలీవుడ్ లో కూడా ఆమెకి పెద్ద సినిమా ఆఫర్లు లేవు ఇప్పుడు. ఇలాంటి టైంలో ఈ భామ తెలుగులోకి అని వార్తలు వస్తున్నాయి.

34
Sudheer Babu Jatadhara Finds Its Leading Lady in Sonakshi Sinha in telugu


బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ ‘దబాంగ్’ బ్యూటీ తెలుగులో సుధీర్ బాబు సరసన నటించనుంది అని టాక్. సుధీర్ బాబు “ఝాటధరా” అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

బాలీవుడ్ కి చెందిన ప్రేరణ అరోరా అనే నిర్మాత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక పెద్ద హీరోయిన్ ని తీసుకోవాలని ప్రయత్నించి చివరికి సోనాక్షిని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. 
 

44
Sudheer Babu Jatadhara Finds Its Leading Lady in Sonakshi Sinha in telugu


గతంలో  సోనాక్షి గతంలో బాలకృష్ణ సరసన ఒక సినిమాలో చెయ్యాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆమె నో చెప్పింది. అలాగే మెగాస్టార్ సరసన “ఆచార్య”లో మొదట ఆమెని తీసుకోవాలనుకున్నారు. మొత్తానికి ఈ భామ ఇప్పుడు తెలుగులో అరగేంట్రం చెయ్యనుంది అన్నమాట. అయితే అఫీషియల్   ప్రకటన రావాలి.
 

Read more Photos on
click me!

Recommended Stories