హీరోయిన్స్ కూడా ఈర్ష్య పడేలా స్నేహారెడ్డి గ్లామర్... ఐకాన్ స్టార్ వెంటపడింది ఆ అందం చూసేగా!

Published : Aug 14, 2022, 01:00 PM ISTUpdated : Aug 14, 2022, 01:08 PM IST

పొరపాటున స్నేహారెడ్డి ఇండస్ట్రీకి రాలేదు కానీ... ఏమాత్రం ఓ కన్నేసినా స్టార్ హీరోయిన్ గా వెండితెరను ఏలేసేవారు. టాప్ టూ బాటమ్ హీరోయిన్ మెటీరియల్ అయిన స్నేహారెడ్డి అందానికి కొలమానం లేదని చెప్పొచ్చు. అంత అందగత్తె కాబట్టే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆమె వెంటపడ్డాడు. 

PREV
16
హీరోయిన్స్ కూడా ఈర్ష్య పడేలా స్నేహారెడ్డి గ్లామర్... ఐకాన్ స్టార్ వెంటపడింది ఆ అందం చూసేగా!
Sneha Reddy


అల్లు అర్జున్(Allu Arjun) వైఫ్ గా కాకుండా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది స్నేహ. సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఐకాన్ గా అవతరించి మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. స్నేహారెడ్డిని ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 8.3 మిలియన్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. 

26
Sneha Reddy


ఇది ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ అని చెప్పొచ్చు. తాజాగా స్నేహారెడ్డి(Allu Snehareddy) ట్రెండీ డిజైనర్ శారీలో సూపర్ గ్లామరస్ గా కనిపించారు. ఆమె లుక్ మెస్మరైజ్ చేస్తుండగా నెటిజెన్స్ మాయలో పడిపోతున్నారు. స్నేహారెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. 
 

36
Sneha Reddy


ఇక ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో అల్లు అర్జున్ తో పాటు స్నేహారెడ్డి పట్ల అభిమానం, ప్రేమ చూపిస్తున్నారు. అన్న అల్లు అర్జున్ కి తగ్గ అందమైన వదిన అంటూ కితాబు ఇస్తున్నారు. మరి కొందరు మేడమ్ సార్.. మేడం అంతే అంటూ కామెంట్ చేశారు. ఇక నైస్, బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ కామెంట్స్ చేసేవారు ఎందరో ఉన్నారు. 
 

46

మరికొందరైతే మీరు హీరోయిన్ కావాల్సింది పొరపాటున అటువైపు వెళ్లలేదని కామెంట్ చేశారు. స్నేహారెడ్డి గ్లామర్ చూస్తే ఎవరికైనా ఈ అభిప్రాయం కలగాల్సిందే. 2011 మార్చ్ 6న స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రేమను గెలిపించుకున్నారు ఈ జంట.

56


కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహారెడ్డితో అల్లు అర్జున్ కి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. హైదరాబాద్ లో కొన్ని విద్యాసంస్థలకు అధిపతి అయిన శేఖర్ రెడ్డి కూతురే స్నేహారెడ్డి. అల్లు అర్జున్ తో వివాహానికి శేఖర్ రెడ్డి ఒప్పుకోలేదు. స్వయంగా అల్లు అరవింద్ వెళ్లి అడిగినా నో.. అన్నారు. 

66


అయితే స్నేహారెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. అల్లు అర్జున్ ని తప్పా ఎవరినీ వివాహం చేసుకోనని తెగేసి చెప్పారట. ఇక చేసేది లేక బన్నీని అల్లుడిగా శేఖర్ రెడ్డి ఒప్పుకున్నారు. టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, స్నేహారెడ్డి లకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు అయాన్, అమ్మాయి అర్హ. ఖాళీ సమయంలో పిల్లలతో హాయిగా ఆడుకోవడం బన్నీకి ఇష్టమైన వ్యాపకం. 

Read more Photos on
click me!

Recommended Stories