`పుష్ప` సింగర్‌ సెకండ్‌ మ్యారేజ్‌.. భర్తతో కలిసి రచ్చ.. ఫోటోలు వైరల్‌

Published : May 21, 2022, 03:58 PM ISTUpdated : May 21, 2022, 04:30 PM IST

`పుష్ప` సింగర్‌ కనికా కపూర్‌ తన మ్యారేజ్‌ వేడుకలో రచ్చ చేసింది. తన భర్తతో కలిసి సందడి చేస్తుంది. క్లాసీ స్టెప్పులతో అలరించింది. ఆయా ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి.   

PREV
19
`పుష్ప` సింగర్‌ సెకండ్‌ మ్యారేజ్‌.. భర్తతో కలిసి రచ్చ.. ఫోటోలు వైరల్‌
Singer Kanika Kapoor Wedding Photos

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `పుష్ప`(Pushpa) చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీలోనూ విడుదలై బాక్సాఫీస్‌ ని షేక్‌ చేసింది. అక్కడ ఈ చిత్రం సుమారు వంద కోట్లు వసూళ్లు చేయడం విశేషం. ఇందులో సమంత ఐటెమ్‌ సాంగ్‌ చేసిన `ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ` అనే పాట ఎంతగా ఫేమ్‌ అయ్యిందో తెలిసిందే. ఈ పాటని తెలుగులో ఇంద్రవాతి చౌహాన్‌ ఆలపించగా, హిందీ వెర్షన్‌ పాటని కనికా కపూర్‌(Kanika Kapoor) ఆలపించారు. 
 

29
Singer Kanika Kapoor Wedding Photos

బాలీవుడ్‌ లోనూ ఈ పాట విశేష ఆదరణ పొందింది. యూట్యూబ్‌లో దుమ్మురేపింది. ఈ పాట పాడిన సింగర్‌ కనికా కపూర్‌ సెకండ్‌ మ్యారేజ్‌(Kanika Kapoor Second Marriage) చేసుకున్నారు. ఆమె లండన్‌ కి చెందిన  వ్యాపారవేత్త గౌతమ్‌ హతిరమనిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమె మ్యారేజ్‌ చేసుకోగా, ఈ వేడుకలో రామ్‌చరణ్‌ భార్య, కనికాకు స్నేహితురాలు అయిన ఉపాసన (Upasana konidela) పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

39
Singer Kanika Kapoor Wedding Photos

శుక్రవారం లండన్‌లోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో వ్యాపారవేత్త గౌతమ్‌ హతిరమనిని పెళ్లాడింది.వీరి వెడ్డింగ్‌  దగ్గరి బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌ గా జరిగింది. ఈ ఫోటోను కనికా కపూర్‌ తన ఇన్‌ ట్రాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో తన భర్తకి లవ్‌ ఎమోజీని పంచుకుంటూ, ఐ లవ్‌ సో మచ్‌` అని పేర్కొంది కనికా కపూర్‌. 
 

49
Singer Kanika Kapoor Wedding Photos

ఇందులో ఉపాసనతోపాటు, సింగర్‌ మన్మీత్‌ సింగ్‌ సందడి చేశారు. ఆమె నూతన వధూవరులతో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ `మీరెంత అందంగా ఉన్నారో మీరు కలిసి సాగించే జర్నీ కూడా అంతే అందంగా ఉండాలని కోరుకుంటున్నా` అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
 

59
Singer Kanika Kapoor Wedding Photos

కనికాకు ఇంతకుముందే పెళ్లయింది. 18 ఏళ్ల వయసులోనే(1998) రాజ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని లండన్‌కు వెళ్లిపోయింది. ఆమెకు ఆయనా, సమర, యువరాజ్‌ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలానికి దంపతుల మధ్య విబేధాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి పిల్లల బాధ్యతను కనికానే చూసుకుంటోంది. లక్నోలో పెరిగిన ఆమె అప్పుడప్పుడూ తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్‌కు వస్తూ ఉంటుంది.
 

69
Singer Kanika Kapoor Wedding Photos

కనికా.. `బేబీ డాల్‌`, `చిట్టియక్కలాయాన్‌`, `టుకుర్‌ టుకుర్‌`, `జెండా ఫూల్‌` పాటలతో హిందీ జనాలను ఉర్రూతలూగించింది. ఇటీవల `పుష్ప` మూవీలో `ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌`తో అలరించింది. సినిమా సాంగ్‌లతోపాటు, ప్రైవేట్‌ ఆల్బమ్స్ కూడా పాడి బాలీవుడ్‌ శ్రోతలను మెప్పిస్తుంది. అలరిస్తుంది. 

79
Singer Kanika Kapoor Wedding Photos

సింగర్‌ కనికా కపూర్‌, గౌతమ్‌ మ్యారేజ్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీలు, ఆడియెన్స్ ఆమెకి మ్యారేజ్‌కి సంబంధించిన విషెస్‌ తెలియజేస్తున్నారు.

89
Singer Kanika Kapoor Wedding Photos

సింగర్‌ కనికా కపూర్‌, గౌతమ్‌ మ్యారేజ్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీలు, ఆడియెన్స్ ఆమెకి మ్యారేజ్‌కి సంబంధించిన విషెస్‌ తెలియజేస్తున్నారు.

99
Singer Kanika Kapoor Wedding Photos

సింగర్‌ కనికా కపూర్‌, గౌతమ్‌ మ్యారేజ్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీలు, ఆడియెన్స్ ఆమెకి మ్యారేజ్‌కి సంబంధించిన విషెస్‌ తెలియజేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories