వెన్నెల కాంతిని వెదజల్లుతున్న ఐశ్వర్య రాజేశ్.. ట్రెడిషనల్ వేర్ లో డస్కీ బ్యూటీ అందాలు అదరహో..

Published : May 21, 2022, 03:37 PM ISTUpdated : May 21, 2022, 03:38 PM IST

హీరోయిన్ ఐశ్వరా రాజేష్  (Aishwarya Rajesh) క్యూట్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తోంది. తను పోస్ట్ చేసిన పిక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. 

PREV
16
వెన్నెల కాంతిని వెదజల్లుతున్న ఐశ్వర్య రాజేశ్.. ట్రెడిషనల్ వేర్ లో డస్కీ బ్యూటీ అందాలు అదరహో..

తమిళ హీరోయిన్  ఐశ్వర్యా రాజేష్ ప్రస్తుతం తమిళ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. అయినా సోషల్ మీడియాలో తన అభిమానులకు దగ్గరగానే ఉంటోంది.  లేటెస్ట్ ఫొటోషూట్లతో వారిని ఖుషీ చేస్తోంది. ఎప్పుడూ ట్రెడిషన్ లుక్ లో దర్శనమిస్తూ కనువిందు చేస్తోంది.
 

26

ఐశ్వర్యా గ్లామర్ షోకు దూరంగా ఉంటుంది. ఎప్పుడూ సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి అచ్చమైన తెలుగమ్మాయిగా కనిపిస్తుంది. అటు సినిమాల్లోనూ గ్లామర్ ఒళకబోయడంలో తక్కువనే చెప్పాలి. కానీ ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంటుంది ఐశ్వర్య.   
 

36

ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోందీ బ్యూటీ. తన అభిమానులకు దగ్గరగా ఉంటూ లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా నిర్వహించిన ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.  

46

ఈ ఫొటోల్లో ఐశ్వర్య చాలా అందంగా కనిపిస్తోంది. బ్లాక్ చుడీదార్ లో తన స్కిన్ టోన్ మెరిసిపోతోంది. వేయి కాంతుల వెలుగులను నింపుకున్నట్టుగా తన మొహం వెలిగిపోతోంది. ఈ సందర్భంగా ఫొటోలకు మతిపోయేలా స్టిల్స్ ఇస్తూ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. పిక్స్ ను ప్రస్తుతం అభిమానులు వైరల్ చేస్తున్నారు.

56

ఐశ్వర్య రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలే కాకుండా  లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కూడా  చేస్తోంది ఐశ్వర్య. `మిస్‌మ్యాచ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `టక్‌ జగదీష్‌`, `రిపబ్లిక్‌` చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను  అలరించింది. ఈ చిత్రాలతో ఐశ్వర్యకు పెద్దగా హిట్ మాత్రం రాలేదనే చెప్పాలి. 
 

66

ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తోంది. `ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌,  `డ్రైవర్‌ జమునా`, `మోహన్‌దాస్‌`, మలయాళంలో `పులిమడ`  వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. విభిన్న  పాత్రల్లో ప్రేక్షకులకు అలరించనుంది. తర్వలో ఈ చిత్రాలు రిలీజ్ కు సిద్ధమవనున్నాయి.  

click me!

Recommended Stories