మీరు ఒకరిని గట్టిగా అవమానిస్తారు. కానీ అదే స్థాయిలో క్షమాపణలు కోరరు... అనే కారణం చూపుతూ పృథ్విరాజ్ ని ఆదిత్య ఓం నామినేట్ చేశాడు. నేను ఎవరినీ ఇన్సల్ట్ చేయలేదని పృథ్విరాజ్ డిపెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం నబీల్, సోనియా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
సోనియాను నబీల్ నామినేట్ చేశాడు. అలాగే పృథ్విరాజ్ ని కూడా నామినేట్ చేశారు. వీరిద్దరితో నబీల్ కి గొడవైంది. గట్టిగా వాదించుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం... ఈ వారం 7 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. నిఖిల్, సీత, విష్ణుప్రియ, యష్మి నామినేషన్స్ లో లేరట.