ప్రొడక్షన్ డిజైనర్లు మోనిక, రామకృష్ణ ఎర్రచందనం కృత్రిమ దుంగలు రూపొందించారు. ఫోమ్, ఫైబర్ కలిపి కృత్రిమ దుంగల్ని తయారు చేశారు.ఎర్రచందనం దుంగల కోసం చిన్న ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది ఆర్ట్ డిపార్ట్‌మెంట్. కొన్ని సన్నివేశాల కోసం వేల సంఖ్యలో కృత్రిమ దుంగలు వాడారు. ఎర్రచందనం దుంగలు, సామాగ్రిని అడవుల్లోకి తీసుకెళ్లడానికి కష్టమయ్యేది. ఇందుకోసం అడవుల్లో కొన్ని చోట్ల మట్టి రోడ్లు కూడా నిర్మించారు.