`పుష్ప` మూడో పార్ట్.. `ఆర్‌ఆర్‌ఆర్‌` కాన్సెప్ట్.. సుకుమార్‌ మామూలోడు కాదుగా.. బన్నీ ఫ్యాన్స్ కి పండగే..

First Published | Feb 6, 2024, 11:09 PM IST

`పుష్ప 2` సినిమా కోసం యావత్‌ ఇండియా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి మైండ్‌ బ్లాక్ అయ్యే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. దీనికి మరో పార్ట్ ఉందని అంటున్నారు.

 తెలుగులో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక మూవీ `పుష్ప2`. ఈ సినిమా కోసం ఇండియన్‌ ఆడియెన్స్ మాత్రమే కాదు, వరల్డ్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అంతగా ఈ మూవీ పాటలు, మేనరిజం వెళ్లింది. దీంతో అదే రేంజ్‌లో ఈ మూవీని రూపొందిస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. బడ్జెట్‌ కూడా భారీగా పెరిగిపోయిందని తెలుస్తుంది. అయినా రాజీపడకుండా నిర్మిస్తున్నారట. సీన్లు బెస్ట్ వచ్చేలా చెక్కుతున్నారట సుకుమార్‌. సీన్ల వైజ్‌గా, విజువల్‌ వైజ్‌గా చాలా గ్రాండియర్‌గా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇంటర్నేషనల్‌ క్వాలిటీ కోసం ప్రయత్నిస్తున్నారట సుకుమార్. 

Pushpa2

 ఈ నేపథ్యంలో `పుష్ప2` మూవీపై సర్వత్రా ఆసక్తి, అంచనాలు పెరుగుతున్నాయి. అయితే బన్నీ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే వార్త ఈ మూవీకి సంబంధించిన ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంకా చెప్పాలంటే ఇండియన్‌ ఆడియెన్స్ కి మతిపోయే వార్త వినిపిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పుడు రెండో పార్ట్ వస్తుండగా, మరో పార్ట్ రాబోతుందట. ఇదే సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. 


pushpa2

`పుష్ప`కి మరో పార్ట్ రానుందట. మొత్తం మూడు పార్ట్ గా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు సుకుమార్‌. ప్రస్తుతం `పుష్ప2` తెరకెక్కుతుండగా, దీనికి కొనసాగింపుగా మరో పార్ట్ ఉంటుందని తెలుస్తుంది. `పుష్ప`లో పుష్పరాజ్‌ లోకల్‌ బాయ్‌గా కనిపించారు. కూలోడుగా, ఆ తర్వాత స్మగ్లర్‌గా మారాడు. ఇప్పుడు `పుష్ప2`లో నేషనల్‌ వైడ్‌గా స్మగ్లింగ్‌ డీలర్‌గా కనిపించబోతున్నారట. ఎర్రచందనం సిండికేట్‌ని నడిపించే వ్యక్తిగా కనిపించనున్నారని తెలుస్తుంది. 

అయితే ఇప్పుడు మూడో పార్ట్ లో ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌గా కనిపిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో పూర్తయ్యింది. త్వరలోనే జపాన్‌ లో షూటింగ్‌ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అది నిజమే అంటున్నారు. అది క్లైమాక్స్ సీన్లు అని తెలుస్తుంది. పుష్పరాజ్‌ జపాన్‌లోనూ బిజినెస్‌ చేస్తారట. అక్కడి వరకు తన వ్యాపారాన్ని విస్తరిస్తాడని, అంతర్జాతీయ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది, ఆ సీన్లనే జపాన్‌లో షూట్‌ చేయనున్నట్టు సమాచారం. 
 

`పుష్ప` క్లైమాక్స్ లో రెండో పార్ట్ కి హింట్‌ ఇచ్చారు. భన్వర్‌ సింగ్‌ షేకావ్‌తో గొడవని చూపించారు. ఇప్పుడు రెండో పార్ట్ క్లైమాక్స్ లో అంతర్జాతీయ విలన్లతో గొడవ ఉంటుందని అది మరో రేంజ్‌లో ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో సుకుమార్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` ఫార్మూలాని ఫాలో అవుతున్నారు. మొదటి పార్ట్ `పుష్పః ది రైజ్‌`గా తెరకెక్కించారు. ఇప్పుడు `పుష్పః రూల్‌`గా రూపొందిస్తున్నారు. ఇక మూడో పార్ట్ `పుష్పః రోర్‌` గా రూపొందిస్తారట. `రైజ్‌, రూల్‌, రోర్‌`(ఆర్‌ఆర్‌ఆర్‌) స్ట్రాటజీని వర్కౌట్‌ చేస్తున్నట్టు సమాచారం. దీని అప్‌డేట్‌, అధికారిక ప్రకటన వచ్చే వారంలో ఉండబోతుందని తెలుస్తుంది. 
 

ఇది నిజమే అయితే బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని చెప్పడం కంటే వారికి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే ఈ మూవీ హిట్‌ అయితే బన్నీ గ్లోబల్‌ స్టార్‌ అయిపోతాడని చెప్పొచ్చు. ప్రభాస్‌ తరహాలోనే ఆయన కూడా తిరుగులేని స్టార్‌గా ఎదుగుతాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక బన్నీకి జోడీగా `పుష్ప2`లో రష్మిక మందన్నా నటిస్తుంది. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. అనసూయ, సునీల్‌ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ ఈ మూవీని నిర్మిస్తున్నాయి.  

Latest Videos

click me!