‘మాస్టర్’ హీరోయిన్ మాళవికా మోహనన్ నెట్టింట అందాల మంట పెడుతున్నవిషయం తెలిసిందే. సినిమాల అప్డేట్స్ ను అందిస్తూనే మరోవైపు తన గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది.
కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. అలాగే హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ క్రమంలో మాళవికా మోహనన్ ఎప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas నటిస్తున్న ‘రాజా సాబ్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికైతే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. హీరోయిన్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఏదేమైనా త్వరలోనే మాళవికా మోహనన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మలయాళ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. కిర్రాక్ లుక్స్ లో కట్టిపడేస్తోంది.
తాజాగా ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ మాళవికా చేసిన ఫొటోషూట్ మైండ్ బ్లోయింగ్ ఉంది. ట్రాన్స్ ఫరెంట్ శారీలో యంగ్ బ్యూటీ అందాల విందు చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. మత్తెక్కించే చూపులతో మతులు పోగొట్టింది.
ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లోనే కనిపించేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ గ్లామర్ డోస్ మాత్రం ఏమాత్రం తగ్గనివ్వదు. ఈ క్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. త్వరలో మాళవికా ‘తంగలాన్’ చిత్రంతో అలరించనుంది.