Rashmika Mandanna : రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక మందన్న.. సినిమాకి ఎంత చెబుతోందంటే?

Published : Feb 06, 2024, 06:08 PM IST

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న Rashmika Mandanna ప్రస్తుతం ఆయా చిత్రాల్లో నటిస్తోంది. రీసెంట్ బ్లాక్ బాస్టర్ తర్వాత రష్మిక మందన్న రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని తెలుస్తోంది. 

PREV
16
Rashmika Mandanna : రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక మందన్న.. సినిమాకి ఎంత చెబుతోందంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాలతో అలరిస్తోంది. దక్షిణాదిలోలాగే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనూ ఆఫర్లు అందుకుంటోంది. అక్కడి ఆడియెన్స్ కు మరింతగా దగ్గరవుతోంది. 

26

రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ Ranbir Kapoor సరసన ‘యానిమల్ ది ఫిల్మ్’లో నటించిన విషయం తెలిసిందే. ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ అదరగొట్టింది. గీతాంజలి పాత్రలో తన అభిమానులను, ఆడియెన్స్ ను అలరించింది. 

36

బాలీవుడ్ లో ఇలా తొలిహిట్ ను అందుకుంది. Animal The Film హిట్ కావడంతో ఇటు సౌత్ లోనూ రష్మికమందన్నకు భారీగా క్రేజ్ పెరిగింది. మళ్లీ తనకు మంచిగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో నేషనల్ క్రష్ నిర్మాతలకు షాక్ ఇచ్చింది. 

46

తన రెమ్యునరేషన్ ను ఇరవైఐదు శాతం పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా ప్రాజెక్ట్ లకు వర్క్ చేస్తున్న రష్మిక మందన్న సినిమాకు రూ.3 కోట్లు అందుకుంటోందని తెలుస్తోంది. ఇక తాజాగా పారితోషికాన్ని పెంచేసిందని టాక్ వినిపిస్తోంది. 

56

ఇటీవల సైన్ చేసిన ఓ సినిమాకు రష్మిక మందన్న రూ. 4 కోట్ల వరకు డిమాండ్ చేసిందని అంటున్నారు. ఇక నెక్ట్స్ Pushpa 2, ది గర్ల్స్ ఫ్రెండ్, రెయిన్ బో వంటి సినిమాలతో అందుకునే ఫలితంతో మరింతగా రెమ్యునరేషన్ పెంచే ఛాన్స్ ఉందంటున్నారు. 

66

పూజా హెగ్దే, అనుష్క, సమంత వంటి స్టార్ హీరోయిన్లే సినిమాకు రూ.3 కోట్ల పారితోషికం తీసుకుంటున్న ఈ సమయంలో రష్మిక రెమ్యునరేషన్ ను పెంచడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. 
 

click me!

Recommended Stories