అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఇప్పుడు `పుష్ప 2` మూవీ రూపొందుతుంది. మూడేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కి ఇది రెండో పార్ట్. మూడేళ్లుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. మొదటి భాగం పెద్ద విజయం సాధించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో సినిమా రేంజ్ కూడా పెరిగింది. దీంతో భారీ స్కేల్‌లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కిస్తున్నారు సుకుమార్.
క్వాలిటీ పరంగానూ సినిమాని పెంచేస్తున్నారు. భారీ అంచనాలున్న నేపథ్యంలో సినిమా లావిష్‌గా, మరింత లార్జ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. అదే సమయంలో కంటెంట్ పరంగానూ రాజీ పడటం లేదు. ఏమాత్రం అసంతృప్తిగా ఉన్న కూడా రీ షూట్ చేస్తున్నారట సుకుమార్. క్వాలిటీ విషయంలో రాజీ పడటం లేదు. అందుకే షూటింగ్ ఆలస్యమవుతుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే `పుష్ప 2` షూటింగ్ జపాన్‌లో ఉండబోతుందట. నెక్ట్స్ షెడ్యూల్‌ని జపాన్‌లో చిత్రీకరించబోతున్నారట. కథ రేంజ్‌ని పెంచే క్రమంలో, పుష్ప బిజినెస్ అంతర్జాతీయంగా నడిపించాడనే విషయాన్ని తెలిపే క్రమంలో జపాన్‌లో కొన్ని కీలక సన్నివేశాలను, అలాగే యాక్షన్ సీన్లని చిత్రీకరించబోతున్నారట. పుష్ప అంతర్జాతీయంగానూ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఎలా చక్రం తిప్పారనేది ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తుంది.
అంతేకాదు ఇందులో మరో విలన్ ని పరిచయం చేయబోతున్నారట. అంతర్జాతీయ విలన్ ని కూడా ఇందులో చూపించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకోసం ఓ ఇంటర్నేషన్ యాక్టర్‌ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఫహద్ ఫాజిల్‌ని ఓ విలన్‌గా చూపించబోతున్నారు. ఇప్పుడు అంతర్జాతీయంగానూ మరో విలన్‌ని పరిచయం చేయబోతున్నారట. దీంతో ఇది మరో పార్ట్ లింక్ ఉంటుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే `పుష్ప` సినిమా ప్రారంభంలోనే ఎర్రచందనం స్మిగ్లింగ్ ప్రధానంగా జపాన్, చైనాలో జరుగుతుందని చెప్పారు. ఆ లింక్ బేస్డ్ గా ఇప్పుడు స్క్రిప్ట్ లో సరికొత్త మార్పులు చేసి, సినిమా స్కేల్‌ని పెంచే ప్రయత్నం చేస్తున్నారట దర్శకుడు సుకుమార్. `పుష్ప2`ని ఇంటర్నేషనల్ మూవీగా ప్రజెంట్ చేసే ప్రయత్నం జరుగుతుందట. మన భారతీయ సినిమాలకు `జపాన్`లో మంచి క్రేజ్ ఉంది. బాగా ఆడుతాయి. `పుష్ప` కూడా అక్కడ బాగా ఆడింది. దీంతో సరికొత్త స్ట్రాటజీని మెయింటేన్ చేస్తున్నారట. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
ఇక సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న `పుష్ప2` సినిమాలో బన్నీకి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఫహద్ పాజిల్ పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షేకావత్‌గా కనిపిస్తారు. ఆయన పాత్ర నెగటివ్‌గా సాగబోతుంది. మరోవైపు సునీల్, అనసూయ, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రం రూపొందుతుంది. ఆగస్ట్ 15న ఈ మూవీని విడుదల చేయబోతున్నారట.