పుష్ప 2: దేవిశ్రీ ప్రసాద్ కు టీమ్ ట్విస్ట్ ?

First Published | Nov 7, 2024, 8:18 AM IST

పుష్ప 2 ది రూల్ చిత్రం డిసెంబర్ 5 న విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ తో పాటు తమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్పరాజ్, భన్వర్ సింగ్ మధ్య వార్ ఈ చిత్రంలో హైలెట్ గా ఉండనుంది.

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


 రెండు తెలుగు రాష్ట్రాల్లో ని సినీ ప్రేమికులే కాదు.. దేశ వ్యాప్తంగా అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప-2' ది రూల్. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.  

ఇదే కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప ది రైజ్‌' సంచలన విజయం సాధించడంతో  ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదు. దాంతో చిత్రం టీమ్ సైతం సినిమా అవుట్ ఫుట్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ  చిత్రంలోని అల్లు అర్జున్‌ మేనరిజం, స్టయిల్‌, సినిమా మేకింగ్‌, సుకుమార్‌ బ్రిలియంట్‌ స్క్రీన్‌ప్లే అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసిన సుకుమార్ ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై దృష్టి పెట్టారు. 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


డిసెంబరు 5న 'పుష్ప-2' ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఇంకా నెలరోజులు లోపే  ఉంది. ప్రస్తుతం  షూటింగ్ దశలో వున్న ఈ చిత్రం మరో వైపు శరవేగంగా నిర్మాణానంతర పనులను కూడా జరుపుకుంటోంది.

ఈ క్రమంలో దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు తమన్ తో కూడా ఓ వెర్షన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరిలో ఎవరివి ఏ ఎపిసోడ్ కు అద్బుతంగా బ్యాక్ గ్రౌండ్ సెట్ అయితే దాన్ని ఫైనల్ చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇందుకు దేవి సైతం ఒప్పుకున్నట్లు వినికిడి. 


Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లో, మీడియా వినపడుతున్న వార్త మాత్రమే. బాలీవుడ్ లో ఇలా ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరక్టర్స్ కలిపి పనిచేస్తూంటారు. ఇక్కడా అదే అప్లై చేస్తున్నారు. ఇదే కనక నిజమైతే ఇదో ట్రెండ్ గా మారి ప్రతీ పెద్ద సినిమాకు ఇద్దరు ముగ్గరు మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేసే అవకాసం ఉంది. 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


మరో ప్రక్క ఈ సినిమా హైలెట్స్ విషయానికి వస్తే... 'పుష్ప' పార్ట్‌-1లో పుష్పరాజ్‌, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ మధ్య వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే ఇప్పుడు 'పుష్ప-2 ది రూల్' చిత్రంలో వీరిద్దరి మధ్య అసలైన వార్‌ జరగబోతుందని మేకర్స్‌ ఈ రోజు విడుదల చేసిన  కౌంట్‌ డౌన్‌ పోస్టర్‌లో హింట్‌ ఇచ్చారు.

రక్తంతో ఎరుపెక్కిన పోస్టర్‌లో పోటా పోటీగా ఇద్దరు కనిపించడం అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేసింది. పుష్ప-2లో వీరిద్దరి మధ్య సన్నివేశాలు ఎంతో పవర్‌ఫుల్‌గా, ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని తెలిసింది.  భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ వర్సెస్‌ పుష్పరాజ్‌ మధ్య వార్‌ పుష్ప-2లో ఏ స్థాయిలో ఉంటుందో ఈ పోస్టర్‌ తెలియజేస్తుంది. 


  త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  అలాగే పుష్ప 2 చిత్రం మొత్తం 11,500 స్క్రీన్లలో విడుదల కానుంది. సినీ పరిశ్రమ చరిత్రలో ఇదే అతిపెద్ద రికార్డు. పుష్ప2 సినిమా భారతదేశంలో 6000 స్క్రీన్లలో విడుదల కానుంది.

అంతే కాకుండా విదేశాల్లో కూడా 5500 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ సైతం భారీగా ప్లాన్ చేసారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ పుష్ప 2 సినిమా క్రేజ్ పెరిగిపోవటమే అందుకు కారణం. ఇక ఈ చిత్రం  ప్రమోషన్స్ ని బీహార్ నుంచి మొదలుపెట్టటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


నార్త్ ఇండియా మార్కెట్ ని దున్నేయటానికి దర్శకుడు సుకుమార్ కొత్త ప్రమోషన్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఫస్ట్   ప్రమోషన్ ఈవెంట్ ని బీహార్ లోని పాట్నాలో  ప్లాన్ చేస్తున్నారు.

చాలా గ్రాండ్ గా అక్కడ ఈ సినిమా  ప్రమోషన్స్ జరగనున్నాయి. బీహార్ లో పుష్ప సినిమా బాగా ఆడటమే అందుకు కారణం. అలాగే నార్త్ లోని మరికొన్ని కీ సెంటర్స్ ని ఎక్సప్లోర్ చేసి కొత్తగా ఈవెంట్స్ చేయబోతున్నారు. ముంబై, డిల్లీ వంటి నగరాలని ప్రక్కన పెట్టబోతున్నారు.

Latest Videos

click me!