కెరీర్ లో ఏ హీరోయిన్ కి భయపడని చిరంజీవి, ఆమెకి మాత్రం వణికిపోయారు.. కారణం కుటుంబ సభ్యులే

First Published | Nov 7, 2024, 7:27 AM IST

మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్లుగా టాలీవుడ్ లో అగ్ర హీరోగా రాణిస్తున్నారు. మధ్యలో కొన్నేళ్ల పాటు రాజకీయాలకు చిరు సమయం కేటాయించారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించారు, ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. 

మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్లుగా టాలీవుడ్ లో అగ్ర హీరోగా రాణిస్తున్నారు. మధ్యలో కొన్నేళ్ల పాటు రాజకీయాలకు చిరు సమయం కేటాయించారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించారు, ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. కానీ మెగాస్టార్ ఎప్పుడూ తడబడలేదు. చిరంజీవితో నటించాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా ఇతర హీరోయిన్లు భయపడే పరిస్థితి ఉండేది. 

అలాంటిది చిరు ఒకే ఒక్క హీరోయిన్ విషయంలో చాలా టెన్షన్ పడ్డారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. చందమామ కాజల్ అగర్వాల్. చిరంజీవి టెన్షన్ కి కారణం ఉంది. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యుల వల్లే కాజల్ విషయంలో నేను టెన్షన్ పడాల్సి వచ్చింది. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో చిరంజీవి ఘనమైన ఎంట్రీ ఇచ్చారు. 


డైరెక్టర్ వివి వినాయక్ ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ని తీసుకుందాం అని చెప్పినప్పటి నుంచే చిరుకి టెన్షన్ మొదలైందట. కాజల్ రాంచరణ్ కలసి నటించారు. ఆన్ స్క్రీన్ పై వాళ్ళిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. కాజల్ కళ్యాణ్ బాబుతో కూడా నటించింది. అదే విధంగా బన్నీతో కూడా నటించింది. వీళ్ళ ముగ్గురితో కాజల్ పెయిర్ బావుంటుంది. 

నాతో నటిస్తే ఆడియన్స్ ఏమనుకుంటారు ? మా ఇద్దరి పెయిర్ బావుంటుందా ? ఏజ్ గ్యాప్ ఎక్కువగా కనిపిస్తుందా ? చరణ్, పవన్, బన్నీలతో నన్ను పోల్చుతారా అని చిరంజీవి అనుకున్నారట. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అలాంటి విమర్శలు ఏమి రాలేదని.. మా పెయిర్ కూడా బావుందని చిరంజీవి అన్నారు. 

మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో కాజల్, రాంచరణ్ జంటగా నటించారు. ఆర్య2లో అల్లు అర్జున్ తో.. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ తో కాజల్ నటించింది. చిరంజీవి, కాజల్ మధ్య 30 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. చిరంజీవి, కాజల్ ఆచార్య చిత్రంలో కూడా నటించాల్సింది. కానీ ఆమె పాత్రని తొలగించారు. 

Latest Videos

click me!