పుష్ప 2 బిజియం వివాదం: పెళ్లి ఒకరితో, ఫస్ట్ నైట్ మరొకరితో.. తమన్ సంచలన కామెంట్స్ వైరల్

First Published | Nov 8, 2024, 2:23 PM IST

పుష్ప 2 చిత్రం రిలీజ్ టైం దగ్గరపడుతున్న సమయంలో ఫ్యాన్స్ ఉలిక్కిపడి షాక్ తగిలింది. ఈ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ ని పాక్షికంగా తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. దేవిశ్రీని తప్పించారు అని చెప్పడం కంటే కేవలం సాంగ్స్ కి మాత్రం పరిమితం చేశారు అని చెప్పడం బావుంటుందేమో.

పుష్ప 2 చిత్రం రిలీజ్ టైం దగ్గరపడుతున్న సమయంలో ఫ్యాన్స్ ఉలిక్కిపడి షాక్ తగిలింది. ఈ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ ని పాక్షికంగా తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. దేవిశ్రీని తప్పించారు అని చెప్పడం కంటే కేవలం సాంగ్స్ కి మాత్రం పరిమితం చేశారు అని చెప్పడం బావుంటుందేమో. సౌత్ లో దేవిశ్రీ తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు. 

దేవిశ్రీ, సుకుమార్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ మూవీ అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్స్ అయిపోవచ్చు. అలాంటిది పుష్ప 2 విషయంలో ఎందుకు విభేదాలు వచ్చాయి ? దేవిశ్రీ ని కేవలం సాంగ్స్ కి మాత్రమే ఎందుకు పరిమితం చేశారు అనేది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. 


అయితే జరుగుతున్న ప్రచారం మేరకు పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ ఇచ్చిన బిజియం విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ సంతృప్తి చెందలేదట. దీనితో సుకుమార్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ తో బిజియం చేయించుకుంటాం అని దేవిశ్రీకి చెప్పేశారు. వెంటనే ఏకంగా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని రంగంలోకి దించారు. థమన్, సామ్ సీఎస్, అంజనీష్ లోకనాథ్ ముగ్గురూ పుష్ప 2 బిజియం కోసం వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఇది కంఫర్మ్ అయిందట. 

ఒక్కొక్కరి నుంచి సుకుమార్ ఒక్కో వర్షన్ బిజియం తీసుకోబోతున్నారని.. ఏది బావుంటే అది ఫైనల్ చేస్తారని ఒక రూమర్ వినిపిస్తోంది. మరికొందరు చెబుతున్న దాని ప్రకారం తమన్ కొన్ని సన్నివేశాలకు.. సామ్ కొన్ని సన్నివేశాలకు, అంజనీష్ మరికొన్ని సీన్లకు బిజియం ఇస్తారని కూడా అంటున్నారు. మొత్తంగా దేవిశ్రీకి అయితే ఇన్సల్ట్ జరిగింది. దీనితో దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ జీరించుకోలేకున్నారు. తమన్ గతంలో చేసిన కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు. 

Thaman

ఒక చిత్రానికి కొన్ని సాంగ్స్ చేయడం లేదా బిజియం మాత్రమే చేయడం.. మిగిలినవి వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేయడం తమన్ కి నచ్చదు. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో తమన్ తెలిపారు. బాలీవుడ్ లో ఇలాంటి కల్చర్ ఉంటుంది. ఒక సినిమాకి ఐదారుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో సాంగ్ చేస్తారు. బిజియం మరొకరు చేస్తారు. వాళ్ళ మధ్య సింక్ ఎలా కుదురుతుందో తెలియదు. ఆ పద్ధతి నాకు నచ్చదు. ఒక సినిమాకి పనిచేస్తే పూర్తిగా ఆ చిత్రం కోసమే డేడికేట్ అవ్వాలి. ఒక చిత్రాన్ని ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే ఉండాలి. 

సాంగ్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్, బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మరో మ్యూజిక్ డైరెక్టర్ చేయడం అంటే పెళ్లి ఒకరితో శోభనం మరొకరితో అన్నట్లుగా ఉంటుంది అంటూ తమన్ కామెంట్స్ చేశారు. ఈ మాటలనే దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అప్పడు అలా మాట్లాడిన తమన్ ఇప్పుడు పుష్ప 2 చిత్రానికి ఎందుకు ఒప్పుకున్నట్లు అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా తమన్ ఇలా బిజియం, కొన్ని సాంగ్స్ మాత్రమే చేసిన చిత్రాలు ఉన్నాయి. ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రానికి తమన్ బిజియం కి మాత్రమే వర్క్ చేశారు. 

Latest Videos

click me!