కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే వస్తున్న క్రమంలో.. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కృష్ణ ఫ్యామిలీలో నటిగా మంచిపేరు తెచ్చుకుంది మంజుల.
ఆమె తరువాత ఈ ఫ్యామిలీ నుంచి పక్కగా కమర్షియల్ హీరోయిన్ గా మజుల కూతురు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. మజుల కూతురు జాహ్నవి స్క్రీన్ ఎంట్రీకి సంబంధించి చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది.
అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే కృష్ణ తరువాత ఆయన వారసత్వంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, రమేష్ బాబు, సుధీర్ బాబు, గల్లా అశోక్, అశోక్ తమ్ముడు, ఇక ఇప్పుడు రమేష్ బాబు కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. సుధీర్ బాబు పెద్ద కొడుకు కూడా హీరో అవ్వడానికి నటనలో ట్రైయినింగ్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Also read: ఆ హీరోయిన్ భుజంపై చేయి వేయడానికి భయపడిన అక్కినేని నాగేశ్వరావు. కారణం ఏంటి..?