నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ రివ్యూ

First Published | Nov 8, 2024, 2:08 PM IST

 చాలా గ్యాప్ తర్వాత ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాతో నిఖిల్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చారు.  దివ్యాంశ కౌశిక్‌, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మళ్లీ నిఖిల్ కు గత వైభవం తెచ్చి పెట్టిందా, సినిమా కథేంటి, ఎలా ఉంది? 

Nikhil, Appudo ippudo Epuudo, movie review


నిఖిల్ ఒకప్పుడు వరస హిట్స్ కొట్టాడు. కార్తికేయ తో ప్యాన్ ఇండియా లెవిల్ కు వెళ్లాడు. అయితే ఆ తర్వాత  ఎన్నో ఆశలతో నిఖిల్ ‘స్పై’ అనే సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ  సినిమా  ఆడలేదు.

ఆ తర్వాత  చాలా గ్యాప్ తర్వాత ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాతో నిఖిల్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చారు.  దివ్యాంశ కౌశిక్‌, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మళ్లీ నిఖిల్ కు గత వైభవం తెచ్చి పెట్టిందా, సినిమా కథేంటి, ఎలా ఉంది? 
 

Nikhil, Appudo ippudo Epuudo, movie review

స్టోరీ లైన్

లవ్ ఫెయిలై లండన్ వస్తాడు రిషి (నిఖిల్). అతనికి మంచి రేసర్ కావాలని జీవితాశయం. సర్లే అని అక్కడే రేసర్ గా ట్రైనింగ్ తీసుకుంటూ కాలక్షేపం చేస్తూంటాడు. ఈ క్రమంలో అక్కడ  తులసి (దివ్యాంశ కౌశిక్) పరిచయం అవుతుంది. ఆమెను ప్రేమించి ఆమెను పెళ్లాడాలనుకుని ఫిక్స్ అవుతాడు. కానీ చిత్రంగా . తులసి మిస్ అవ్వుతుంది. ఈ లోగా  హైదరాబాద్ లో తాను ప్రేమించిన తార (రుక్మిణి వసంత్) లండన్ లో కనపడుతుంది. దాంతో రిషి దృష్టి ఆమె మీదకు మళ్లుతుంది. 
 


Nikhil, Appudo ippudo Epuudo, movie review


కరెక్ట్ గా ఆమెకు ప్రపోజ్ చేసే సమయానికి తులసి (దివ్యాంశ కౌశిక్) వచ్చి, రిషిని హగ్ చేసుకుంటుంది. దాంతో తార అలిగి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం చెయ్యాలో అర్దం కాని సిట్యువేషన్ లో ఉండగా లోకల్ డాన్ బద్రి నారాయణ (జాన్ విజయ్) మనుషులు వచ్చి రిషి, అతని స్నేహితుడు యాజీ అలియాస్ బాలాజీ (హర్ష చెముడు)  ని కిడ్నాప్ చేస్తారు.

మరో ప్రక్క రిషీ ఇంట్లో ఒక అమ్మాయి హత్యకు గురి అయ్యి ఉంటుంది. అసలు రిషీ చుట్టూ ఏం జరుగుతుంది. లోకల్ డాన్ ఎందుకు రిషిని కిడ్నాప్ చేసాడు. అతని లవ్ స్టోరీ ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

Nikhil, Appudo ippudo Epuudo, movie review

ఎలా ఉందంటే...

సుధీర్ వర్మ కెరీర్ ప్రారంభంలో నిఖిల్ తో స్వామి రారా వంటి సూపర్ హిట్ ఇచ్చాడు. మళ్లీ చాలా కాలం గ్యాప్ తర్వాత అదే దర్శకుడుతో సినిమా చేసారు. కానీ చిత్రంగా  మినిమం  ప్రమోషన్ కూడా లేకుండా మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశారు.  ట్రైలర్ కొంత ప్రామిసింగ్ గానే అనిపించినా పెద్ద బజ్ రాలేదు. దానికి తగినట్లు ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. అంతెందుకు  ఈ మూవీ రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అందుకు కారణం ఈ సినిమా చూసాక మనకు అర్దమవుతుంది.

నిర్మాతలు సినిమా చూసుకుని ఇక్కడికి ఇది చాల్లే అని ఫిక్సయ్యారు అని. ఈ సినిమా అంత గజి బిజిగా ఉంటుంది. ఫస్టాఫ్ అయ్యేసరికే ఓ పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. కొంచెం కూడా ఆసక్తి లేని స్క్రీన్ ప్లే తో బోరింగ్ గా నడిపారు. సెకండాఫ్ లో ట్విస్ట్ లు కొన్ని బాగానే ఉన్నా సినిమా మొత్తాన్ని నిలబెట్టే విధంగా లేవు. ముఖ్యంగా సినిమాలో కీలకమైన ట్విస్ట్ అసలు వర్కవుట్ కాలేదు.  ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు కావాల్సిన టెన్షన్ ఎలిమెంట్ వర్కవుట్ కాలేదు.
 

Nikhil, Appudo ippudo Epuudo, movie review


వాస్తవానికి ఇదో థ్రిల్లర్ సినిమా అని షాట్స్, క్యారక్టర్స్ డిజైన్ చేసిన విధానం చూసి ఫిక్స్ అవుతాము. అయితే కథ కాసేపటికి ముక్కోణపు ప్రేమ కథగా టర్న్ తీసుకోవటంతో షాక్ అవుతాం. అదే దర్శకుడు కోరుకుంటే హ్యాపేనే. కానీ అక్కడ నుంచి రొటీన్ ట్రాప్ లో పడిపోతుంది. లవ్ స్టోరీ అయితే మరీ దారణంగా అనిపిస్తుంది. ఎంతలా అంటే పాటలు వచ్చినప్పుడే రిలీఫ్ ఫీలవుతాం.

యాక్షన్ సీక్వెన్స్ ని బలంగా చేసుకుని మిగతావి గాలికి వదిలేసారు. విలన్ ట్రాక్ అయితే మరీ సిల్లీగా ఉంటుంది. హీరోని ప్యాసివ్ పాత్రలా చేసి, ఎక్కడో ఏదో రివీల్ చేద్దాం అనుకుంటే బోల్తాపడతాం. తెలుగు సినిమా మారుతున్న క్రమంలో ఓటిటి గాలి బాగా వీస్తున్న ఈ టైమ్ లో ఇలాంటి కథనం పై పట్టులేని కథలు అంతగా ఆకట్టుకోవు. ఈ సినిమా చేయటానికి నిఖిల్ ని ఎక్సైట్ చేసిన అంశం కేవలం సుధీర్ వర్మే అనుకుంటా. కథ నిజంగా విని  ఉంటే ఈ సినిమా చేసి ఉండకపోను అనిపిస్తుంది. 
 

Nikhil, Appudo ippudo Epuudo, movie review

టెక్నికల్ గా

  గతంలో సుధీర్ వర్మ చేసిన సినిమాల టెక్నికల్ స్టాండర్డ్స్ లో  ఈ సినిమా ఉండదు.  రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ యావరేజ్ అనిపిస్తుంది.  కార్తీక్ పాటలు జస్ట్ ఓకే అన్నట్లు ఉన్నాయి. సన్నీ ఎం.ఆర్ బ్యాక్ గ్రౌండ్ సైతం చేతులు ఎత్తేసింది.

డైలాగులు జస్ట్ ఓకే. ఎడిటింగ్ ఫస్టాఫ్ సాగ తీసినట్లుగా ఉంటే సెకండాఫ్ కాస్త రిలీఫ్ ఇచ్చేలా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.   లండన్ సిటీలో ప్రైమ్ లొకేషన్లలో తీసిన  ఛేజ్ సీక్వెన్స్ బాగున్నాయి. 
 

Nikhil, Appudo ippudo Epuudo, movie review


నటీనటుల్లో నిఖిల్ చేయటానికి ఏమీ లేదు. అప్పడప్పుడూ ఫైట్స్ తప్పించి. మిగతా దంతా మామూలే.  రుక్మిణీ వసంత్  అందంతో కాస్త చూసేవారికి ఓదార్పు ఇస్తుంది. దివ్యాంశ కౌశిక్ డైలాగ్స్ అయితే చాలా చోట్ల లిప్ సింక్ లేదు. జాన్ విజయ్ విలనీలో బలం లేదు. చాలా సిల్లీగా ఆ సీన్స్ ఉండటంతో తేలిపోయింది. 
 

Nikhil, Appudo ippudo Epuudo, movie review


ఫైనల్ థాట్

కేవలం మేకింగ్ ఉంటే సినిమా నిలబడదు. సినిమాకి  కథ, కథనం కూడా కీలమే అని ఫిల్మ్ మేకర్స్ కు పాఠం చెప్పటానికి తీసిన సినిమా అనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమాని ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్ ఓ లెస్సన్ గా చెప్పుకోవటానికి పనికొస్తుంది. 

---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 1.75
 

Latest Videos

click me!