మరి ఎన్టీఆర్ మెచ్చిన డాన్సర్ ఎవరు అంటే బాలీవుడ్ స్టార్ హీరో, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్. ఎన్టీఆర్ ఫేవరేట్‌గా భావించే డాన్సర్ హృతిక్ అట. ఆయన డాన్స్ అద్బుతంగా చేస్తాడని తెలిపారు తారక్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరిలో బెస్ట్ డాన్సర్ ఎవరు? అని యాంకర్ అడితే హృతిక్ అని చెప్పారు.
తాము తారక్ గొప్ప అని భావిస్తామని చెప్పినా, తనకంటే హృతిక్ డాన్స్ అద్భుతంగా చేస్తాడని, తన ఫేవరేట్ అని స్పష్టం చేశారు. రమ్యకృష్ణతో చేసిన ఓ పాత ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వీడియో ఇటీవల వైరల్‌గా మారింది.