పుష్ప 2: ‘కిస్సిక్‌’ సాంగ్..7 కోట్లు కలిసొచ్చినట్లే? !

First Published | Nov 14, 2024, 6:47 PM IST

పుష్ప 2 లో శ్రీలీల కోటి రూపాయలకు ఐటెం సాంగ్ చేస్తున్నారు. శ్రద్ధా కపూర్ 8 కోట్లు డిమాండ్ చేయడంతో శ్రీలీలను ఎంచుకున్నారు. ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Sreeleela, samantha,#Pushpa2


అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. అదే సమయంలో శ్రీలీల అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎదురుచూపులు మొదలెట్టారు. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె ఓ మాస్ మసాలా సాంగ్ చేస్తోంది.

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య పుష్ప2  మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో అసలు శ్రీలీల కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అనే  విషయం హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఎంతోమందిని ఎంపిక చేసి చివరకు శ్రీలీలను ఫైనల్ చేయటం వెనక అసలు కథేంటి అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో డిస్కషన్ గా మారింది. 
 

Allu Arjun, #Pushpa2, sukumar

గుంటూరు కారం వచ్చాక  శ్రీలల పేరు మారు మ్రోగింది. ఈ సినిమాలో ఆమె వేసిన మాస్ స్టెప్స్ కు యూత్ ఊగిపోయారు. ఈ క్రమంలో ఆమె చేత ఓ ఐటెం సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన పుష్ప 2  ఫిల్మ్ టీమ్ కు వచ్చింది. అంతకు ముందు చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ ఈ  ప్రాజెక్టులోకి స్పెషల్ సాంగ్ కోసం అనుకున్నా అవేమీ మెటీరిలైజ్ కాలేదు. దాంతో శ్రీలీల సీన్ లోకి వచ్చింది. 



ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ ముందుగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వద్దకు వెళ్లిందట. అయితే కిస్సింగ్ సాంగ్ కోసం బీటౌన్ బ్యూటీ ఏకంగా రూ.8 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.

 బాలీవుడ్ హీరోయిన్ అయితే హిందీలోనూ సినిమాకి బజ్ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావించింది.కానీ.. రెమ్యూనరేషన్ విషయంలో శ్రద్ధ కపూర్ వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో సమంతలాగే శ్రీలీలకు క్రేజ్ తేవచ్చు అనే ఆలోచన సుకుమార్ చేసి ఈ డెసిషన్ తీసుకున్నారు. 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


రెగ్యులర్ గా దర్శకుడు సుకుమార్‌ సినిమాలో ఐటం సాంగ్‌ ప్రత్యేక ఆకర్షణ . ‘జగడం’ మొదలు కొని.. ‘పుష్ప ది రైజ్‌’ వరకూ ఆయన తెరకెక్కించిన చాలా చిత్రాల్లో ఒక స్పెషల్‌ సాంగ్‌ ఉంటూ వస్తోంది.

‘పుష్ప ది రైజ్‌’లోని ‘ఊ అంటావా’కు అంతటా ఆదరణ లభించింది. సమంత డ్యాన్స్‌కు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. ఆ పాటకు వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకుని ‘పుష్ప ది రూల్‌’లోనూ అలాంటి సాంగ్‌ క్రియేట్‌ చేయాలని సుకుమార్‌ భావించినట్లు తెలుస్తోంది. 

allu arjun movie Pushpa2 The Rule release on december 5th


‘ధమాకా’తో డ్యాన్స్‌లో  శ్రీలీల తన టాలెంట్‌ని బయటపెట్టారామె. ఈ నేపథ్యంలోనే డ్యాన్స్‌లో ఐకాన్‌గా పిలవబడే అల్లు అర్జున్ (Allu Arjun) సరసన ఆమె భాగం కావడంతో ఈ పాటపై అప్పుడే ఎక్సపెక్టేషన్స్  ఏర్పడ్డాయి. థియేటర్లు ఈసారి దద్దరిల్లిపోతాయని పలువురు అనుకుంటున్నారు. వీరిద్దరూ గతంలో ఓ యాడ్‌ కోసం వర్క్‌ చేశారు.
 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


 ఈ సాంగ్ కోసం శ్రీలీల  కోటి రూపాయల చెక్‌ అందుకుంటుందట. శ్రద్దా కపూర్ అయితే 8 కోట్లు అడిగింది. అంటే శ్రీలీల వల్ల 7 కోట్లు దాకా కలిసి వచ్చిందని నిర్మాతలు ఆనందపడుతున్నారని తెలుస్తోంది.  శ్రీలీల (Sreeleela) తమ ప్రాజెక్టులో భాగమైనట్లు పుష్ప 2 టీమ్ అధికారికంగా ప్రకటించింది.

ఇందులో ఆమె స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నట్లు తెలిపింది. ‘కిస్సిక్‌’ అంటూ సాగే ఈ పాట సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కానుందని పేర్కొంది. సినీ ప్రియులను ఇది తప్పక అలరిస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తమ టీమ్‌లోకి ఆమెను స్వాగతిస్తూ చిత్రబృందం స్పెషల్‌ పోస్టర్‌ షేర్‌ చేసింది. ‘ది డ్యాన్సింగ్‌ క్వీన్ శ్రీలీల’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.

Latest Videos

click me!