అఖిల్ కు చిరంజీవి ‘విశ్వంభర’దెబ్బ? ఇలా జరుగుతోందేంటి?

First Published | Nov 14, 2024, 6:26 PM IST

చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతుండటంతో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌కి ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీని ప్రభావం అఖిల్ కొత్త సినిమాపై పడి, వాయిదా పడింది.

Akhil, Vishwambara, Chiranjeevi, uv creations

 చిరంజీవి (Chiranjeevi) హీరో గా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా  చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర టీమ్  అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. చిరు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇందులో ఆయన త్రిశూలం చేత పట్టుకుని కన్పించారు. ‘‘చీకటి, చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు, ఒక అద్భుతమైన తార పోరాడటానికి ప్రకాశిస్తుంది’’ అని చిత్ర ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది.  ఈ సినిమాకు ఇప్పటికే ఓ రేంజిలో క్రేజ్ ఉంది.  అంతవరకూ బాగానే ఉంది. అయితే ఈ సినిమా ఇంపాక్ట్ వెళ్లి అఖిల్ కొత్త సినిమాపై పడుతోందిట. అదెలా అనేది చూద్దాం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Akhilesh Yadav


గత కొంతకాలంగా యువి క్రియేషన్స్ వరుస ఫ్లాప్లను అందిస్తూ వస్తోంది.  దాంతో ఆ సంస్ద  చాలా ఆర్థిక ఒత్తిడిలో ఉంది. దాంతో ఈ సారి వారు ఆచి,తూచి అడుగులు వేయాలని మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన విశ్వంభర మీదే పూర్తి దృష్టి పెట్టారు. సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా టైమ్ తీసుకుని సినిమా సెట్ చేసారు.  

వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందుతోంది. ఇప్పటివరకూ చిరంజీవి నటించిన సినిమాలతో పోలిస్తే, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘విశ్వంభర’ తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలిచిపోనుంది. 
 


Akhilesh Yadav


అంతేకాదు, సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం.ఈ చిత్రం 2025 సంక్రాంతి రేసులో ఉంది, కానీ రకరకాల లెక్కల కారణంగా వేసవికి వాయిదా పడింది. మేకర్స్ ఈ సినిమాపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు.

అలాగే వారి పెద్ద పెట్టుబడులను తిరిగి పొందడానికి రిలీజ్  కోసం ఎదురుచూస్తున్నారు.  ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ డీల్స్ కూడా ఇంకా పూర్తి కాలేదు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండటంతో ఫైనాన్సియల్ ప్రెజర్ చాలా ఉంది. 
 


ఇదిలా ఉంటే ఇదే బ్యానర్ లో అక్కినేని అఖిల్ హీరోగా ఓ సినిమా ఓకే చేసారు.  100 కోట్ల బడ్జెట్ తో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్  ఓ యోధుడిగా నటిస్తున్నారు. కానీ నిర్మాతలు విశ్వంభర చిత్రం కోసం  కేవలం డబ్బు మాత్రమే కాకుండా తాము కూడా   బ్లాక్ అయ్యిపోయారు. పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు. ఇదొక ప్రెస్టేజియస్ సినిమాగా చేస్తున్నారు.  దాంతో  వారు  అఖిల్  చిత్రాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేశారు. 

Akhil


2025 ద్వితీయార్థంలో అఖిల్  ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దాంతో అఖిల్ ఈ సినిమా కన్నా ముందే మరో సినిమా చేయాలనకుంటున్నరు. మురళి కిషోర్ డైరక్షన్ లో ఆ సినిమా మొదలు కానుంది.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమవుతుంది మరియు నాగార్జున యొక్క అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. యూవీ క్రియేషన్స్ సినిమా చేయడానికి ముందు పేరు చెప్పని ఈ సినిమా షూటింగ్  పూర్తి చేస్తాడని అన్నారు.

Chiranjeevi


విశ్వంభర విషయనికి వస్తే ఈ సినిమా కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చిరంజీవి కనిపించనున్నారు. త్రిష కథానాయికగా కనిపించనున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఇది రూపుదిద్దుకుంటోంది. ‘బింబిసార’తో అందరి దృష్టి ఆకర్షించిన వశిష్ఠ ఈ మూవీని ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.

read more: రామ్ చరణ్ 'లిప్‌లాక్ సీన్స్‌' కు నో చెప్పడం వెనుక అసలు కథేమిటి?

also read: `దేశముదురు` సినిమాని చేయాల్సింది ఏ హీరో తెలుసా? సూపర్‌ స్టార్‌ కావాల్సింది, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అయ్యాడు!

Latest Videos

click me!