షాకింగ్ రేటుకు #Pushpa-2 హిందీ డబ్బింగ్ రైట్స్

First Published | Oct 23, 2024, 10:00 AM IST

పుష్ప 2 చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగాయి. నార్త్ లో ఈ చిత్రం బిజినెస్ క్రేజ్ ఓ రేంజిలో ఉంది. హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి.

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

అల్లు అర్జున్‌, సుకుమార్‌ క్రేజీ కాంబోలో రూపొందుతున్న చిత్రం పుష్ప-2 దిరూల్‌. గతంలో ఈ కలయికలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ సినిమా పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌ ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగులో కన్నా నార్త్ లో బిజినెస్ క్రేజ్ ఓ రేంజిలో ఉండటం గమనార్హం. దానికి తగినట్లు నార్త్ సినిమాలు పెద్దగా భాక్సాఫీస్ పై ఇంపాక్ట్ చూపకపోవటంతో సౌత్ సినిమాలపైనే అక్కడి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ దృష్టి ఉంది. 
 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


తెలుగు నుంచి వస్తున్న పెద్ద సినిమాల్లో నార్త్ లో మంచి క్రేజ్ ఉన్న ప్రాజెక్టు పుష్ప 2. ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్న సమయంలో నిర్మాతలు డీల్స్ క్లోజ్ చేయటంలో బిజిగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటిటి, శాటిలైట్ డీల్స్ క్లోజ్ అయ్యాయని వార్తలు వచ్చాయి. అయితే ఓటిటి డీల్ ఇంకా క్లోజ్ కాలేదని, ఓటిటి సంస్దలతో నెగోషియేషన్స్ జరుగుతున్నాయని, త్వరలో క్లోజ్ చేస్తారని చెప్తున్నారు. ఈ క్రమంలో హిందీ డబ్బింగ్ రైట్స్ వివరాలు బయిటకు వచ్చాయి.


Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


పుష్ప ది రైజ్ మొదటి పార్ట్ నార్త్ లో 150 దాకా వసూలు చేసింది. దాంతో బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఎగ్జిబిటర్స్ నుంచి ప్రెజర్ ఉంది. దాంతో హిందీ డబ్బింగ్ రైట్స్ 220 కోట్లకు క్లోజ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు నార్త్ లో సెన్సేషనల్ ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. డిసెంబర్ మొత్తం పుష్ప నెలగా మారిపోతుందని అక్కడ మీడియా అంటోంది. 

 గంధపు చెక్కల స్మగ్లింగ్, అమ్మ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.  అలాగే రూ.370 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది.   అయితే పుష్ప మొదటి భాగంలో  స్టార్  హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది.

ఈ సాంగ్ సినిమా కలెక్షన్స్ పై  ప్రభావం చూపిందని చెప్పవచ్చు. దీంతో పుష్ప సెకెండ్ పార్ట్ లోని స్పెషల్ సాంగ్ పై ఆసక్తి నెలకొంది. ఈ  సాంగ్ లో ఎవరు చేయబోతన్నారనే వార్త అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఓ వార్త బయిటకు వచ్చింది.


హిందీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా  బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శ్రద్దా కపూర్ పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. శ్రద్దా కపూర్ గతంలో ప్రబాస్ చిత్రం సాహో లో హీరోయిన్ గా చేసింది.  ఈ వార్త నిజమయితే నార్త్ లో పుష్ప 2 కి మంచి హైప్ వస్తుందని అలాగే కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంటుందనేది నిజం.  
 

ఏదైమైనా పుష్ప చిత్రం నార్త్ ఇండియాలో సినిమా బ్లాక్‌బస్టర్ కావడం వల్ల  సుకుమార్ పై భారం ఎక్కువే పడిందని చెప్పాలి. దాంతో  ‘పుష్ప-2’కు కూడా బాగా హైప్ వచ్చింది. బిజినెస్ అలాగే జరిగింది. ఈ క్రమంలో   ఈ సినిమా మేకింగ్ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

సుకుమార్ క్వాలిటీ విషయంలో రాజీ పడడని అందరికీ తెలుసు. స్క్రిప్టు తయారీ దగ్గర్నుంచి చాలా టైం తీసుకునే చేస్తారు. లెక్కలేనన్ని వెర్షన్లు రాయిస్తాడు. ఎక్కడిక్కడ ఫిక్స్ కాకుండా నిరంతరం మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాడు. ఆఖరి క్షణం వరకూ  సీన్, డైలాగులు మారుస్తాడని  చెప్తారు.   అయితేనేం అవుట్ ఫుట్ అదిరిపోతుంది. అదే కదా ప్రేక్షకులకు కావాల్సింది. 
 

Latest Videos

click me!