బాలకృష్ణ NBK109 ప్రీ-బిజినెస్ సంచలనం

First Published | Oct 23, 2024, 8:51 AM IST

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK109 సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ అంచనాలను మించిపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకుంది.

NBK109, pre-business, Balakrishna


వయస్సు పెరిగే కొద్దీ బాలయ్య మార్కెట్ మరింత విస్తృతమవుతోంది. ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లు బ్రద్దలు కొడుతున్నాయి. మరో ప్రక్క ఆయన ఓటిటి షో తోనూ దుమ్ము రేపుతున్నారు. రాజకీయాలు, సినిమాలు, షోలు ఇలా వరసగా బిజీగా ఎప్పుడూ జనాల్లో ఉండటంతో బాలయ్య సినిమాలకు బిజినెస్ ఆ స్దాయిలోనే జరుగుతోంది. బాలయ్య తాజా చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ మామూలుగా లేదని ట్రేడ్ లో వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే...

NBK109, pre-business, Balakrishna


నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో NBK 109 పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ ప్రాజెక్ట్‌ నుంచి బాలయ్య బర్త్‌డే గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ నుంచి నాగవంశీ, సౌజన్య ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తున్నాడు. 


NBK109, pre-business, Balakrishna


 NBK 109  సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా థమన్‌ ఉన్నారు. గతేడాది మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో డైరెక్టర్‌ బాబీ హిట్‌ కొట్టాడు. అందులో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసిన ఊర్వశి రౌటేలాకు డైరెక్టర్‌ బాబీ మరో ఛాన్స్‌ ఇచ్చాడు. NBK 109 చిత్రంలో ఆమె కూడా ఒక స్పెషల్‌ సాంగ్‌లో మెరవనుంది.  చాందిని చౌదరి కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది. ‘NBK109’ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.


 NBK 109 సంక్రాంతి 2025 సందర్భంగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక తేదీ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ఈ సినిమాపై పక్కా ఆ టైమ్ లోనే వస్తుందని ఒక క్లారిటీ వచ్చేసింది.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరగడం విశేషం.


ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాలలో 38-40 రేషియోతో ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం. ఓవరాల్ గా 75 కోట్ల వరకు తెలుగు రాష్ట్రాల బిజినెస్ పూర్తయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇదే రీతిలో వరల్డ్ వైడ్ గా ‘NBK109’ సినిమా 90 కోట్ల వరకు బిజినెస్ సాధించింది. బాలయ్య సినిమాకు ఈ స్దాయి బిజినెస్ జరగటం పెద్ద రికార్డ్. ఇప్పటిదాకా బాలయ్య సినిమా 100 కోట్లు షేర్ తెచ్చుకోలేదు. ఈ సినిమాతో ఆ ఫీట్ జరుగుతుందని భావిస్తున్నారు. 
 


ఎప్పటిలాగే బాలయ్య  మూవీ సీడెడ్ రైట్స్ మాత్రం రికార్డ్ రేటుకు అమ్ముడయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. సీడెడ్ లో బాలయ్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  
అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్రదర్శితం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాలోనూ  అదిరిపోయే ట్విస్టులు ఉండనున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.  

Latest Videos

click me!