విజయ్‌ దేవరకొండతో ఛాన్స్ మిస్‌ చేసుకున్న మరో క్రేజీ బ్యూటీ.. నిజంగా ఆమెది బ్యాడ్‌ లక్కే?

Published : Aug 17, 2022, 07:19 PM ISTUpdated : Aug 17, 2022, 10:12 PM IST

`లైగర్‌` ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు మోగుతోంది. రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రం కావడంతో ఎక్కడ చూసినా ఆ పేరే వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది.   

PREV
16
విజయ్‌ దేవరకొండతో ఛాన్స్ మిస్‌ చేసుకున్న మరో క్రేజీ బ్యూటీ.. నిజంగా ఆమెది బ్యాడ్‌ లక్కే?

విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)కి విడుదలకు ముందే పాన్‌ ఇండియా ఇమేజ్‌ తీసుకొస్తున్న సినిమా `లైగర్‌`(Liger). పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో దీనికి మరింత హైప్‌ పెరిగింది. మరోవైపు బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఆగస్ట్ 25న సినిమా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది యూనిట్‌. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలను చుట్టేస్తున్నారు. 
 

26

విజయ్‌ దేవరకొండ సరసన ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే(Ananya Panday) కథానాయికగా నటించింది. ఆమెకి సైతం ఈ సినిమాతో క్రేజ్‌ అమాంతం పెరిగింది. అయితే ఈ సినిమాలో ముందు అనుకున్న హీరోయిన్‌ అనన్య పాండే కాదట. మరో బాలీవుడ్‌ బ్యూటీని అనుకున్నారట దర్శకుడు పూరీ జగన్నాథ్‌. హాట్‌ సెన్సేషన్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారట. కానీ సెట్‌ కాలేదు. 

36
Image: Getty Images

`లైగర్‌`లో హీరోయిన్‌ పాత్ర గురించి దర్శకుడు పూరీ జగన్నాథ్‌ చెబుతూ, ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) అంటే చాలా ఇష్టమట. ఆమెపై ఉన్న ఇష్టంతో తన సినిమాలో జాన్వీ కపూర్‌(Janhvi Kapoor)ని తీసుకోవాలనుకున్నారట. ఆమెని అప్రోచ్‌ అయ్యామని, కానీ ఆ సమయంలో తన కాల్షీట్లు ఖాళీ లేవని, దీంతో ఆమె నటించడం పాజిబుల్‌ కాలేదని చెప్పారు పూరీ. 
 

46
Janhvi Kapoor Ananya Panday at the night party-crowded People

జాన్వీ కపూర్ డేట్స్ లేకపోవడంతో బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ అనన్య పాండే పేరుని సజెస్ట్ చేశారట. దీంతో అనన్య ఈ సినిమాలోకి వచ్చిందని తెలిపారు. అనన్య పాండే చాలా బాగా చేసిందని, భవిష్యత్‌లో పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అవుతుందని తెలిపారు పూరీ జగన్నాథ్‌. ఈ సినిమాతో అనన్య పాండే సౌత్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతోపాటు ఊహించని క్రేజ్‌ని సొంతం చేసుకుంది అనన్య పాండే. కానీ ఈ బిగ్‌ ప్రాజెక్ట్ ని మిస్‌ చేసుకోవడం వల్ల జాన్వీ చాలా కోల్పోయిందనే చెప్పాలి. 
 

56
Puri Jagannath

మరోవైపు పూరీ జగన్నాథ్‌ `లైగర్‌` చిత్రం గురించి చెబుతూ, `పదేళ్ల క్రితం ఈ సినిమా కథని రాసుకున్నారట. విజయ్‌కి ఈ కథని చెప్పారట. నిజానికి ఆయనకు రెండు స్టోరీలు చెప్పారట. అందులో `లైగర్‌` కథ బాగా నచ్చిందని, ఈ కథకి తగ్గట్టుగా తాను బాడీని బిల్డ్ చేసుకుంటానని, ఈ కథని సినిమా తీయాలని తెలిపారట. దీంతో `లైగర్‌` స్క్రిప్ట్ ని రాసుకున్నట్టు తెలిపారు పూరీ.  సినిమా విషయంలో మొదట టెన్షన్‌ పడ్డారట. కానీ విజయ్‌, అనన్య పాండేలకు ఎక్కడ చూసిన అద్భుతమైన రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో తాను రిలాక్స్ అయినట్టు చెప్పారు పూరీ జగన్నాథ్‌. దేశంలోని అన్ని చోట్ల నుంచి ఊహించని విధంగా స్పందన లభిస్తుందని, ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు చెప్పారు పూరీ. 

66

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సాయిపల్లవి(Sai Pallavi) పేరు కూడా వినిపించింది. ఆమెని కూడా `లైగర్‌`టీమ్‌ అప్రోచ్‌ అయ్యారట. కానీ ఈ సినిమాలో తాను నటించేందుకు నిరాకరించిందట సాయిపల్లవి. ఎంత స్టార్‌ హీరో సినిమా అయినా, హీరోయిన్‌ పాత్రకి ప్రయారిటీ ఉంటేనే చేస్తుంది సాయిపల్లవి. పాత్రకి తగిన ప్రాధాన్యత లేకపోతే చేయదు. అలాగే `లైగర్‌`కి నో చెప్పిందట. అంతకు ముందు `డియర్ కామ్రేడ్‌`లోనూ మొదట సాయిపల్లవిని అప్రోచ్‌ కాగా, ముద్దు సీన్‌ ఉండటంతో నో చెప్పిందట. ఈ రకంగా రెండు సార్లు విజయ్‌తో చేసేందుకు నిరాకరించింది సాయిపల్లవి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories