ఆమెతో పదేళ్ల బంధానికి ఫుల్ స్టాప్, పూరి జగన్నాధ్ సడెన్ డెసిషన్ కి కారణం ఏంటి ?

Published : Mar 13, 2025, 10:49 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా పూరి ఫ్లాప్ చిత్రాలతో సతమతమవుతున్నారు. దీనికి తోడు సొంత ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మించడంతో ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

PREV
14
ఆమెతో పదేళ్ల బంధానికి ఫుల్ స్టాప్, పూరి జగన్నాధ్ సడెన్ డెసిషన్ కి కారణం ఏంటి ?
Charmy kaur

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా పూరి ఫ్లాప్ చిత్రాలతో సతమతమవుతున్నారు. దీనికి తోడు సొంత ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మించడంతో ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్, లైగర్ రెండు చిత్రాలు పూరి జగన్నాధ్ ని ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టాయి. 

24

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించేందుకు హీరోలు ఆసక్తి చూపడం లేదు అనేది టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న మాట. కథ కథనాల్లో పట్టు ఉండడం లేదు. పూరి జగన్నాధ్ రైటింగ్ కూడా తేలిపోతోంది. దీనితో పూరిపై నమ్మకం ఉంచి ఆయనతో సినిమా చేసేందుకు హీరోలు సాహసించడం లేదట. కానీ లక్కీగా ఒక సీనియర్ హీరో పూరి జగన్నాధ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు.. అక్కినేని నాగార్జున. వీళ్లిద్దరి కాంబినేషన్ లో శివమణి, సూపర్ లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి. 

34
Puri Jagannadh

దాదాపు 20 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విషయంలో పూరి జగన్నాధ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇప్పటి వరకు పూరి జగన్నాధ్, హీరోయిన్ ఛార్మితో నిర్మాణ భాగస్వామ్యంలో సినిమాలు చేస్తున్నారు. ఇకపై పూరి జగన్నాధ్ కేవలం దర్శకత్వంపై మాత్రమే ఫోకస్ పెట్టి, ప్రొడక్షన్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. 

44

ఛార్మితో పార్ట్నర్ షిప్ కి కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలపై ఫోకస్ పెడితే అసలు మ్యాటర్ పోతోంది. కాబట్టి ఇకపై తాను దర్శకత్వానికి మాత్రమే పరిమితమై ఉండాలి అని పూరి జగన్నాధ్ నిర్ణయానికి వచ్చారట. ఇకపై పూరి జగన్నాధ్, ఛార్మి పార్ట్నర్ షిప్ లో సినిమాలు ఉండే అవకాశం లేనట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు పదేళ్ల పాటు పూరి జగన్నాధ్, ఛార్మి పార్ట్నర్ షిప్ కొనసాగింది. జ్యోతి లక్ష్మి చిత్రం నుంచి పూరి, ఛార్మి నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories